Ramoji Rao Received Awards : తెలుగు మీడియా మొఘల్, అక్షర యోధుడు, స్వచ్ఛమైన తెలుగు భాషను నేటి పాఠకులకు అందించిన ధీశాలి రామోజీరావునే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటువంటి మహానుభావుడిని ఒక వ్యక్తి కన్నా శక్తి అనడమే ఉత్తమమైనది. ఎందుకంటే అతలా తెలుగు నేలకు, తెలుగు జాతికి తన అక్షరజ్ఞానంతో ఎంతో సేవ చేశారు. తెలుగు మీడియాను ఈనాడుకు ముందు ఈనాడు తర్వాత కూడా అని చెప్పవచ్చు. పాత్రికేయ రంగంపై రామోజీ వేసిన బాట అలాంటిది మరి. ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేస్తూ, తెలుగు వారి అభిరుచులకు తగిన సినిమాలను అందిస్తూ సమాజానికి ఎంతో సేవ చేశారు. ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్ ద్వారా దేశవిదేశాల్లో ఎంతోపేరును గడించారు. అలాంటి యోధుడికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలు అనే అవార్డులతో సత్కరించాయి.
రాష్ట్రభూషణ్ అవార్డు : 2006లో మహారాష్ట్రకు చెందిన ఎఫ్ఐఈ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక రాష్ట్ర భూషణ్ అవార్డును ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ప్రధానం చేసింది. సమాజానికి విశేష సేవలందిస్తున్న వారికి జాతీయస్థాయిలో ఈ అవార్డు ఇస్తారు.
యుద్ధవీర్ అవార్డు : వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి యుద్ధవీర్ ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది. 2001లో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఈ అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ నేటి తరానికి చేస్తున్న సేవకుగాను రామోజీరావుకు అవార్డును ప్రధానం చేస్తున్నట్లు తెలిపారు. యుద్ధవీర్ స్మారకోపన్యాసంలో భాగంగా"ప్రజా జీవనంలో నైతిక విలువలు" అనే అంశంపై రామోజీ మాట్లాడారు.
జీవితకాల విశిష్ట కృషి పురస్కారం : 2003వ సంవత్సరంలో రామోజీరావుకు ప్రతిష్ఠాత్మకమైన జీవితకాల విశిష్ట కృషి పురస్కారాన్ని సినీ అభిమానుల సంఘం ప్రదానం చేసింది. 2002లో విడుదలైన చిత్రాలలో ఉత్తమ చిత్రాల, నటీనటుల, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డును ఇచ్చారు.
లోకమాన్య తిలక్ అవార్డు : 2003లో 11 ఛానళ్ల ద్వారా వివిధ ప్రాంతీయ భాషల అభివృద్ధికి తోడ్పడుతున్నారని, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారని లోకమాన్య తిలక్ అవార్డును రామోజీరావుకు ఇచ్చారు. పుణెలోని లోకమాన్య తిలక్ స్మారక ట్రస్టు ద్వారా ఈ అవార్డును బహుకరించారు.
పద్మవిభూషణ్ : 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. మీడియా రంగానికి చేసిన విశేష సేవకు గానూ ఆయనకు ఈ అవార్డును బహుకరించారు.
రామోజీరావు అస్తమయం - ప్రముఖుల దిగ్భ్రాంతి - Cm Revanth On Ramoji Rao Demise
తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - RAMOJIRAO SERVICES TO MEDIA