Ramadan Special Foods in Telugu : రంజాన్ అంటే చాలు హలీమ్ సందడి మొదలవుతుంది. షీర్ ఖుర్మా, షహీ తుక్డా, కద్దూకా ఖీర్, మటన్, చికెన్ బిర్యానీ, కీమా సమోసా అలా బోలెడు వంటకాలు నోరూరిస్తాయి. రంజాన్ మాసంలో వరంగల్, హనుమకొండలో పెద్దఎత్తున హలీమ్ దుకాణాలు వెలిశాయి. ఘుమఘుమలాడే వంటకాలతో భోజన ప్రియులను కట్టిపడేలా చేస్తున్నారు. ముఖ్యంగా బిర్యానీలతోపాటు హలీమ్, హరీస్‌లను ఇష్టంగా తినేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాత్రుళ్లు నడిచే ఈ దుకాణాలకు అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు.
Ramadan Special Dishes in Warangal : చారిత్రక నగరి ఓరుగల్లులో నోరూరిస్తున్న రంజాన్ రుచుల కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆహార ప్రియులు(Foodies) హోటళ్లు, రెస్టారెంట్లకు బారులు తీరుతున్నారు. పవిత్ర రంజాన్(Ramadan 2024) మాసంలో భాగంగా వేకువజామున చేపట్టిన ఉపవాస దీక్ష సాయంత్రం విరమించిన తర్వాత ముస్లింలు ఆహారం తీసుకుంటారు. అందుకు అనుగుణంగా గోధుమ రవ్వ, 15 రకాల మసాలలతో నోరూరించే విధంగా హలీమ్ తయారు చేస్తున్నారు. కోడి మాంసం, గోధుమ రవ్వ, మసాలలతో హరీస్ తయారు చేసి ఉడకబెట్టిన కోడిగుడ్డుతో కలిపి ఇస్తున్నారు.
Ramadan Special: రంజాన్ స్పెషల్ .. 30 రోజుల్లో 10 లక్షల బిర్యానీలు.. 4 లక్షల హలీం ఆర్డర్లు
ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్న నిర్వాహకులు : జంబో ప్యాక్ పేర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. మటన్ హలీమ్ 120 నుంచి 180 వరకు, హరీస్ 100 నుంచి 150 వరకు విక్రయిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. నిత్యం జరిగే వ్యాపారం కంటే రంజాన్ మాసంలో ఎక్కువగా జరుగుతుందని దుకాణదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Ramadan Special Haleem : వరంగల్‌లోని మండిబజార్, సుబేదారి, కె.ఎల్.ఎల్ రెడ్డి కాలనీ, ఛోటీ మసీదు, కాజీపేట దర్గా, ఈద్గా తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హలీమ్ హరీస్‌లతోపాటు కద్దూకా ఖీర్, అప్రికాట్, సన్‌రైజ్ పుడ్డింగ్, సీతాఫల్ మలాయి, షిటూట్ మలాయి, ఆఫ్రికాట్ డిలైట్, మ్యాంగో మలాయి, గులాబ్ జామున్ మలాయి, కద్దూకా హల్వా, గుజర్‌కా హల్వా లాంటి 20కి పైగా ప్రత్యేక మిఠాయిలు విక్రయిస్తున్నారు. దేశ, విదేశాలకు చెందిన ఎండుఫలాను తెప్పించి అమ్ముతున్నారు. ముస్లింలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు వీటిని తినేందుకు ఇష్టపడుతున్నారు. నోరూరించే చికెన్ హరీస్ అద్భుతమని భోజనప్రియులు చెబుతున్నారు.
రంజాన్ స్పెషల్ ఫుడ్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో ఫేమస్ హోటల్స్ ఇవే !
మలక్‌పేటలో ఫ్రీం హలీం ఎఫెక్ట్ - పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీచార్జ్