Ramadan Shopping in Hyderabad : రంజాన్ మాసం అనగానే చాలామందికి చార్మినార్ గుర్తుకొస్తుంది కారణం అక్కడ జరిగే షాపింగ్. మాములు రోజుల్లోనే అక్కడ విక్రయాలు అధికంగా జరుగుతాయి. రంజాన్ మాసంలో మరీ అధికం. కానీ ఈ సంవత్సరం ఎండల కారణంగా మార్కెట్లో విక్రయాలు జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని, సాయంత్రం వేళల్లో కొద్ది మాత్రం విక్రయాలు జరుగుతున్నాయని అంటున్నారు.
మరోవైపు రాష్ట్రం పదో తరగతి పరీక్షలు జరగడం వల్ల వినియోగదారులు ప్రస్తుతం షాపింగ్‌పై ఆసక్తి చూపించడం లేదని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా వేరే ప్రాంతాల నుంచి ప్రజలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాల కంటే ఈ సారి విక్రయాలు భారీగా తగ్గాయంటున్నారు. ఎండల వల్ల వీధి వ్యాపారుల అధిక మొత్తంలో నష్ట పోతున్నారు.
ఈ మాసంలో అధికంగా పండ్లు విక్రయిస్తారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలైనా చార్మినార్, బేగంబజార్, మలక్‌పేట్, మదీనా, పాతబస్తీ. ఇక్కడ సాధారణంగానే సంవత్సరం పొడవునా బట్టలు, పండ్ల వ్యాపారం అధికంగా జరుగుతుంది. కానీ రంజాన్ మాసంలో ఏడాది కంటే ఎక్కువ ఈ నెలలోనే విక్రయాలు (Ramadan Shopping) జరుగుతుంటాయి. తక్కువ ధరలో నాణ్యమైన బట్టల కొనుగోలుకు మదీనా, చార్మినార్ ప్రాంతాలు ప్రసిద్ధి.
ఏడాది పొడవునా ఈ ప్రాంతమంతా కొనుగోలు దారులతో రద్దీగా ఉంటుంది. పండగ వేళ ఈ రద్దీ కాస్త ఎక్కువే. చిన్న పిన్ను నుంచి లక్షల విలువ చేసే చీరల దాకా ఇక్కడ లభిస్తాయి. బేగంబజారులో బ్యూటీ ఉత్పత్తులతో పాటు ఇంట్లోకి కావాలసిన ప్రతి వస్తువూ బయటికంటే పోలిస్తే ఇక్కడ తక్కువ ధరలకు లభిస్తాయి. నగరవాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తుంటారు.
Charminar Night Shopping : ఎండల వల్ల మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏదైనా కొనుగోలు చేయాలన్నా సాయంత్రం వేళల్లోనే వెళ్లాల్సి వస్తుంది. దీంతో సాయంత్రం వేళ చార్మినార్, కోఠి, బేగంబజార్, మదీనా ప్రాంతాల్లో షాపులన్నీ రద్దీగా ఉంటున్నాయి. ఎండిన ఫలాలు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నా విక్రయాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని వ్యాపారులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.
Ramadan Celebrations: హోంమంత్రి నివాసంలో ఘనంగా రంజాన్ వేడుకలు.. హాజరైన సీఎం కేసీఆర్
గతేడాది కంటే ఈసారి చాలా వరకు గిరాకీ కాస్త తగ్గిందని వచ్చేవారం అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయిందంటే ఉపవాసం ఉన్నవారే కాదు ఇతరులు కూడా ఈ నెలలో ప్రత్యేకంగా లభించే హలీమ్ వంటకాన్నీ (Ramadan Haleem) ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల మొత్తం ఈ వ్యాపారాన్ని పెట్టుకుంటారు. ముస్లీంలే కాకుండా ఇతరులు కూడా హలీమ్‌ను ఇష్టంగా తినే వారుండడమే ఇందుకు కారణం. పండ్ల అమ్మకాలతో పాటు బట్టలు, ఇతర ఉత్పత్తుల కోనుగోళ్లు క్రమంగా ఊపందుకుంటున్నాయి.
Ramadan: రంజాన్ సీజన్ కదా.. రాత్రిపూట చార్మినార్ బజార్‌కు వెళ్లొద్దామా..?