Raksha Bandhan 2024 in AP : తోడపుట్టిన సోదరికి జీవితాంతం కష్ట సుఖాల్లో తోడుంటానని సోదరుడు ఇచ్చే అభయమే రక్షాబంధన్. తరాలు మారినా, యుగాలు గడిచినా వన్నె తరగనిది ఈ పండుగ. అలాంటి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీ సందర్భంగా పలువురు నేతలు, ప్రముఖులు ప్రజలకు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu Rakhi Wishes : తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కాచెల్లెళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం మొదటినుంచి మహిళల పక్షపాతి అని గుర్తు చేశారు. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన విషయం ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలను, ఆస్తులను ఆడవారి పేరిట ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా టీడీపీనేనని అన్నారు. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు తెచ్చామని, బాలికా విద్యను ప్రోత్సహించామని చెప్పారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు అన్నివేళలా, అన్నివిధాలా అండగా ఉంటానని రక్షాబంధన్ సందర్భంగా హామీ ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రకటించారు.
నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ…
— N Chandrababu Naidu (@ncbn) August 19, 2024
Pawan Kalyan Rakhi Wishes 2024 : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. సోదర సోదరి ప్రేమ అనుభవంతో అర్థమవుతుందని తెలిపారు. అక్కాచెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. విప్లవ కవి గద్దర్ పాడినట్టు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో, అక్క నుదుట తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో అన్నారు. అన్నదమ్ముల ఆప్యాయతకు ఎవరు వెలకట్టగలరు? వారికి జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించడం తప్ప అంటూ తన భావాలు పంచుకున్నారు.
అందరికీ శుభాలు కలగాలి : అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ శుభ తరుణాన సోదర సోదరీమణులకు శుభాకాంక్షలని పవన్ కల్యాణ్ అన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ వేడుకను దక్షిణ, తూర్పుఆసియా దేశాల్లోనూ వైభవంగా జరుపుకోవడం అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనురాగానికి ప్రతీక అంటూ గుర్తుచేశారు. ఈ శ్రావణ పౌర్ణమి వేళ అందరికీ శుభాలు కలగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
Lokesh Tweet on Rakhi Festival : అక్కాచెల్లెళ్లకు మంత్రి నారా లోకేష్ రాఖీ పండుగ విషెస్ తెలియజేశారు. సొంత అన్నలా ఆదరించి, తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించిన సోదరీమణుల అనురాగమే తన చేతికి రక్షాబంధనం అన్నారు. మహిళల సంక్షేమానికి, భద్రత- గౌరవం కల్పించడానికి కృషి చేస్తానని మాటిచ్చారు. ఓ సోదరుడిగా సోదరీమణులకు అందించే రాఖీ కానుక ఇదేనని లోకేశ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
నా అక్కాచెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సొంత అన్నలా ఆదరించారు. తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించారు. మీ అనురాగమే నా చేతికి రక్షాబంధనం. మీ సంక్షేమం కోసం, మీకు భద్రత, గౌరవం కల్పించడం కోసం కృషి చేసి రాఖీ పండగ కానుకగా సోదరీమణులకు అందించడమే మీ సోదరుడిగా నా బాధ్యత.…
— Lokesh Nara (@naralokesh) August 19, 2024
రాఖీ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా జరుపుకోవాలి? ఓన్లీ సొంతోళ్లకే కట్టాలా? - Rakhi Festival 2024