MLA Appreciation For Engineering Student In Chittoor District: త్రీడీ సాంకేతికతను వినియోగించి ఏనుగులను కట్టడి చేయొచ్చని ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని రూపొందించిన ప్రాజెక్టు అందరి ప్రశంసలను చూరగొంది. పలమనేరు పురపాలిక పరిధిలోని గొబ్బిళ్లకోటూరుకు చెందిన రజిని వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ ఈ చదువుతోంది. అయితే ఏనుగులు ఎక్కువగా భయపడే అంశాలు (తేనెటీగలు, నిప్పు, పులి, సింహం) సమగ్రంగా అధ్యయనం చేసి మరీ ఈ పరికరాన్ని తయారు చేసినట్లు ఆమె వెల్లడించింది.
లేజర్ టెక్నాలజీతో త్రీడీ బొమ్మలను ప్రదర్శించి వాటిని దారి మళ్లించవచ్చని రజిని వివరించారు. పొలాల్లో సైతం కెమెరా అమర్చి చరవాణి ద్వారా ఆపరేట్ చేయవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ పరికరం ద్వారా ఏనుగులను దూరంగా తరమొచ్చని విద్యార్థిని పేర్కొన్నారు. ఆమె గురువారం ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని కలిసి తన ప్రాజెక్టు నమూనాను చూపారు. ప్రాజెక్టు విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించింది. విద్యార్థిని వినూత్న సృజనకు ఫిదా అయిన ఎమ్మెల్యే ఆమెను అభినందించారు.
"గుడ్లు పెట్టి వెళ్లిన బట్టమేక పిట్ట - ఆ పక్షి కోసం 9చ.కి.మీ. భూమి వదిలేశారు" - సందర్శకులకు అనుమతి
అభయారణ్యాలపై కన్ను - ఎర్రచందనంతో పాటు వన్యప్రాణులు స్మగ్లింగ్