ETV Bharat / state

జన్వాడ ఫామ్‌హౌస్‌ మద్యం పార్టీ కేసు - విచారణకు హాజరైన రాజ్​ పాకాల

విచారణకు హాజరైన కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల - మోకిల పోలీసుల ఎదుట విచారణ

raj_pakala_attend_for_police_investigation_in_janwada_farmhouse_party_case
raj_pakala_attend_for_police_investigation_in_janwada_farmhouse_party_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Raj Pakala Attend For Police Investigation in Janwada Farmhouse Party Case : జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన న్యాయవాదితో పాటు విచారణకు వచ్చారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్‌ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఇటీవల రాజ్‌ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు అందులో పేర్కొన్నారు.

Narsingi ACP Ramana Goud Investigating Raj Pakala : జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్‌ కాలనీలో ఉన్న రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులతో ఈ మద్యం పార్టీ నిర్వహించారు. డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజ్‌ పాకాల స్నేహితుడు విజయ్‌ మద్దూరి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్‌ పాకాలకు నోటీసులు జారీ చేశారు.

కేటీఆర్​ బంధువు ఫామ్​హౌస్​లో కలకలం - డ్రగ్స్ పరీక్షల్లో ఒకరికి పాజిటివ్

ఫామ్‌హౌస్‌లో పోలీసులు తనిఖీ చేస్తున్నప్పుడు ఓ మహిళ అక్కడున్న సెల్​ఫోన్​ను దాచి పెట్టిందని పోలీసులు ఆరోపించారు. దానిని ఆదివారం రాజ్‌ పాకాల స్నేహితుడు విజయ్‌ మద్దూరి పోలీసులకు అప్పగించారు. ఆ మొబైల్​ ఫోన్​లో ఉన్న డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. విజయ్‌ మద్దూరికి కొకైన్‌ మత్తుపదార్ధాలు​ ఎవరు ఇచ్చారన్న దానిని సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోలీసులు అక్రమంగా ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రాజ్‌ పాకాల ఈ నెల 28న కోర్టులో పిటిషన్​ దాఖలు చేయగా దానిపై ధర్మాసనం ఆ రోజే విచారణ జరిపింది.

రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని రాజ్‌ పాకాల తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి కోర్టుకు వివరించారు. పోలీసుల తరఫున ఏజీ ఇమ్రాన్‌ ఖాన్‌ వాదనలు వినిపించారు. అరెస్టు చేస్తామని తాము చెప్పలేదని, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, నిబంధనల ప్రకారమే 41ఏ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం పోలీసులు ఎదుట హాజయ్యేందుకు పిటిషనర్‌కు రెండు రోజుల గడువు ఇచ్చింది.

బల్బులో డ్రగ్స్​ - బెంగళూరు టు హైదరాబాద్​ వయా గుంటూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.