రాష్ట్రమంతా విస్తరించిన రుతుపవనాలు- పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు - Rain alert - RAIN ALERT
Rains and Thunderstorms in Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు జోరందుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 10:03 AM IST
|Updated : Jun 7, 2024, 11:05 AM IST
Andhra Pradesh Weather : కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కురిసిన వర్షాలతో వైఎస్సార్ జిల్లాలోని కుందూనదిలో జలకళ సంతరించుకుంది. నంద్యాల జిల్లా, వైఎస్‌ఆర్ జిల్లా సరిహద్దుల్లోని రాజోలి ఆనకట్ట వద్ద దాదాపు 3 వేల 5 వందల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నదిలో నీటి ప్రవాహంతో పరివాహక ప్రాంతంలో భూగర్భజలాలు పెరుగుతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Rain Alert to Andhra Pradesh : కోనసీమ జిల్లాలో వాతావరణం మారి ఒక్కసారిగా వాన పడడంతో వాతావరణం చల్లబడింది. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానంలో తెల్లవారుజామున గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి డ్రైనేజీ లో ఉన్న చెత్త ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడికి అక్కడ అడ్డుపడడంతో ప్రధాన రోడ్ల పైన వీధిలోని రోడ్లు జలమయమయ్యాయి. క్రీడా ప్రాంగణాలు, కాలేజీ మైదానాలు చెరువులను తలపిస్తున్నాయి. యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి ఆదేశాలతో పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీల్లోని చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టారు.
Rains in Prakasam District : ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారి జలమయమైంది. దీంతో వాగులు పొంగి చెరువులకు వర్షపు నీరు చేరింది. పంటలు అదును వచ్చిన నేపథ్యంలో వర్షం కురవడంపై బోరులో నీరు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Thunderstorm in Nellore : రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోవూరు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో భారీతెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక ప్రకటన వెలువడింది. రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి బుతుపవనాలు జోరందుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం పడింది. వర్షానికి రహదారులు జలమయం కాగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడి చెట్లు దహనమయ్యాయి. పిడుగులు పడిన ప్రాంతంలో నివాసాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
రాగల మూడు రోజుల్లో వర్షాలు-ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణం ఉందంటే? - Meteorological Analysis
Rain Alert to Andhra pradesh : నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటక దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. గురువారం శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో 44మిమీ, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 40మిమీ, శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంటలో 39మిమీ, నెల్లూరు జిల్లా సైదాపురంలో 39మిమీ, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 36.7మిమీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 30మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
Meteorological Analysis : నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి గురువారం (06-06-2024) తెలంగాణలోని మెదక్ నుంచి భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు కూడా తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయ. ఫలితంగా ఆ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలతో రాబోయే 3 నుంచి 4 రోజులలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా చల్లబరచనుంది.