ETV Bharat / state

హైదరాబాద్​లో ఏకధాటిగా కురిసిన వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Rains in Hyderabad - RAINS IN HYDERABAD

Heavy Rain in Hyderabad : రాష్ట్ర రాజధానిలో ఏకధాటి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. వాహనదారులు, పాదచారులు వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Rain In Hyderabad
Heavy Rain in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 7:10 AM IST

Heavy Rainfall in Hyderabad : జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, యూసుఫ్‌గూడ, మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ తదితర అనేక ప్రాంతాల్లో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు మాన్‌సూన్‌ టీమ్స్‌ను రంగంలోకి దింపారు.

రాంనగర్‌ ప్రాంతంలో వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఓ కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారులో నలుగరు ఉండడం గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి కాపాడారు. యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌ ప్రాంతాల్లోనూ వరద నీటి ప్రవాహానికి వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. నాచారంలో కురుస్తున్న కుండపోత వర్షానికి పోలీస్ స్టేషన్ వెనుకవైపు ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరు ప్రయాణించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సినిమా థియేటర్​లో వాననీరు : పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి సినిమా థియేటర్​లో వాననీరు కురుస్తున్నా సినిమాని యాజమాన్యం నిలిపివేయలేదు. షార్ట్​ సర్క్యూట్​ జరుగుతుందని సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్​ యాజమాన్యంతో గొడవకు దిగారు. సినిమా యాజమాన్యం దురుసుగా సమాధానం ఇవ్వడంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. మియాపుర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్ గచ్చిబౌలిలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.

అత్యధిక వర్షపాతం మారేడ్​పల్లి : వరద నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించారు. ఆదివారం నగరంలో అత్యధికంగా మారేడ్‌పల్లిలో 7.5, ఖైరతాబాద్‌లో 6.5, ముషీరాబాద్‌లో 7.3, షేక్‌పేట్‌లో 7.2, శేరిలింగంపల్లిలో 6.9, ఉప్పల్‌లో 6.8, కూకట్‌పల్లిలో 5.9 సెంటీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హెచ్చరికలు జారీ చేసిన జీహెచ్​ఎంసీ : భారీవర్షం కురవడంతో జీహెచ్​ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలు ఇళ్ల నుంచి రావొద్దని జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరసమైతే తప్పా ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని సూచించారు. వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే 040-21111111, 9000113667 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.

హైదరాబాద్​లో భారీవర్షం - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న మేయర్​ - Hyderabad Rains Update

రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.