Radisson Drugs Case Updates : మాదక ద్రవ్యాల కేసులో నిందితుడైన సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రాడిసన్ హోటల్‌లో మాదక ద్రవ్యాలను వినియోగించారని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ క్రిష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ జి.రాధారాణి సోమవారం విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలన్నారు. దీనికి అనుమతించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
Director Krish Withdrew Petition In High Court : తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ గత నెల 28వ తేదీన క్రిష్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు క్రిష్ రెండు రోజుల క్రితం పీఎస్‌కు వెళ్లారు. క్రిష్ శరీరంలో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నాయా లేవా అని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి పోలీసులు అతని మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. పోలీసుల విచారణ పూర్తైన తర్వాత క్రిష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
గోవా జైలు కేంద్రంగా హైదరాబాద్‌లో మత్తు దందా - మొబైల్ నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ సరఫరా
ర్యాడిసన్ హోటల్ మాదక ద్రవ్యాల కేసులో పోలీసుల ఎదుట మరొకరు హాజరయ్యారు. ఈ కేసులో 6వ నిందితుడుగా ఉన్న సందీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. అతడి నుంచి పోలీసులు మూత్ర నమూనాలు సేకరించారు. పరీక్షల్లో పాటిటివ్‌గా తేలితే సందీప్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. మరో వైపు ఆదివారం మరో నిందితురాలు లిషి పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. నిందితులు నీల్, శ్వేత పరారీలో ఉన్నారు. శ్వేత కోసం టీఎస్ న్యాబ్ పోలీసులు గోవాలో గాలిస్తున్నారు.
Radisson Hotel Drugs Case Latest Updates : హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో (Radisson Hotel Drug Bust) డ్రగ్స్ పార్టీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు డ్రగ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. గోవా జైల్లో ఉన్న ఖైదీ అబ్దుల్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని రాణిగంజ్‌కు చెందిన డ్రగ్స్ సరఫరాదారు అబ్దుల్ రెహ్మన్‌కు భారీగా కొకైన్ అందుతున్నట్లు గుర్తించారు. అతడి నుంచి అత్తాపూర్‌లోని కేఫ్ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మీర్జావహీద్ బేగ్ ఆ తర్వాత సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకి చేరుతున్నాయి.
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, అబ్బాస్ అలీ జాఫ్రీ నుంచి కొని డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవాలో ఉండే అబ్దుల్ రాణిగంజ్‌కు చెందిన అబ్దుల్‌రెహ్మాన్ ఇద్దరూ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తూ భారీగా విక్రయాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. అబ్దుల్ రెహ్మాన్‌పై హైదరాబాద్‌లో పలు పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ కేసులున్నట్లు అధికారులు గుర్తించారు.
డ్రగ్స్ కేసులో గోవా మూలాలు - స్నాప్‌చాట్‌లో చాటింగ్ - కొకైన్ డోర్ డెలివరీ
డ్రగ్స్ కేసులో అత్యంత రహస్యంగా పోలీసుల ముందుకు దర్శకుడు క్రిష్ - రక్త, మూత్ర నమూనాల సేకరణ