ALLU ARJUN AT PUSHPA 2 SUCCESS MEET: హైదరాబాద్‌లో 'పుష్ప 2' సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రేక్షకులు లేకుండానే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేవలం కొద్దిమంది ముఖ్యమైన వారు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చి, ఇన్ని రికార్డులు సాధించడానికి కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తమ సినిమాను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు.
పుష్ప2 విజయమంతా దర్శకుడు సుకుమార్‌దే అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. తనను ఎత్తుకొన్ని ఎక్కడో పెట్టాడని సుకుమార్‌ని కొనియాడారు. తొలిరోజు వచ్చిన 'పుష్ప 2' కలెక్షన్లే తన సినిమా ఎంత మంది చూశారనడానికి నిదర్శనం అని అన్నారు. ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నతస్థాయిలో ఉందని వెల్లడించారు.
Icon Star @alluarjun thanks the governments of Andhra Pradesh & Telangana for the immense cooperation they have given to the film.#Pushpa2TheRule RULING IN CINEMAS #Pushpa2#WildFirePushpa
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp… pic.twitter.com/q1S3boqXhf
సంధ్య థియేటర్ ఘటనపై మరోసారి: అదే విధంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై మరోసారి అల్లు అర్జున్ స్పందించారు. తాను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లానన్నారు. అయితే థియేటర్ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల తాను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయానని వెల్లడించారు. రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి సమయం పట్టిందని, అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
Icon Star @alluarjun addresses the unfortunate fan incident that happened at the #Pushpa2TheRule premiere show.
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024
He extended his condolences and assured his complete support to the bereaved family. #Pushpa2#WildFirePushpa pic.twitter.com/58GAUvapF3
సంతోషంగా లేను: తాను మూడు రోజుల నుంచి సంతోషంగా లేనని, ఒక సినిమా మూడు సంవత్సరాలు తీసినా, ఆరు సంవత్సరాలు తీసినా ఒక ప్రాణాన్ని కాపాడుకోలేకపోయానని డైరెక్టర్ సుకుమార్ విచారం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సుకుమార్ తెలిపారు. ఆ బాధ నుంచి బయటపడ్డాకే 'పుష్ప 2' సినిమా రికార్డులు చూస్తున్నామని తెలిపారు.
Director @aryasukku extends his deepest condolences to the family of the bereaved and assures to be there for the family always.#Pushpa2#Pushpa2TheRule pic.twitter.com/NffKfnrR6p
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2024
టికెట్ ధరలు అందుబాటులోనే ఉంటాయి: పుష్ప 2 టికెట్ ధరలపై ఈ సినిమా నిర్మాత రవిశంకర్ స్పందించారు. టికెట్ ధరలపై మేం చర్చిస్తున్నామని అన్నారు. పుష్ప2 టికెట్ ధరలు అందుబాటులోనే ఉంటాయని, రూ.800 అనేది ప్రిమియర్ షోల వరకే అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పుష్ప - 2 సినిమా 500 కోట్ల రూపాయలు వసూలు చేసిందని స్పష్టం చేశారు.