ETV Bharat / state

వైఎస్ వివేకా పీఏ ఇంటికి పోలీసులు - వాంగ్మూలం నమోదు - POLICE QUESTIONED YS VIVEKA PA

2022లో సునీత, ఆమె భర్తపై కృష్ణారెడ్డి ఫిర్యాదు - తాజాగా పోలీసు విచారణ

Police Questioned YS Viveka PA
Police Questioned YS Viveka PA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 10:29 AM IST

Updated : Nov 18, 2024, 2:16 PM IST

Police Inquiry YS Viveka PA : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ కంప్లైంట్‌ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయణ్ని విచారించారు.

న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్​మెంట్​ రికార్డ్ చేశారు. డీఎస్పీ అడిగే ప్రశ్నలు ఆయన చెప్పే సమాధానాలను ఆడియో, వీడియో కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జీషీట్​ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్​ సునీత సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీని కూడా ఆమె కలిశారు. తాజాగా ఇందులోని పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివేకా కుమార్తె సహా మరికొందరిపై 2022లో కోర్టులో దాఖలుచేసిన ప్రైవేట్ కేసుపై కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. ఈ కేసులో కోర్టు లేవనెత్తిన కొన్ని అంశాలపై విచారణ జరిపినట్లు వెల్లడించారు. న్యాయవాది సమక్షంలో విచారణ ప్రక్రియ సాగిందని ఆయన చెప్పారు.

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

Last Updated : Nov 18, 2024, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.