ETV Bharat / state

అసెంబ్లీలో తడబడిన జగన్​ రెడ్డి- 'ఘోరఓటమి తరువాత ఇదే తొలిసారి - pulivendula mla ys jagan oath - PULIVENDULA MLA YS JAGAN OATH

Pulivendula MLA YS Jagan Oath in Assembly: ఎన్నికల్లో ఘోరఓటమి తరువాత వైఎస్సార్సీపీ అధినేత అన్యమనస్కంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు. ప్రమాణ స్వీకారం మొదలైన అయిదు నిమిషాల తర్వాత శాసనసభ ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. ప్రమాణం చేసిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Pulivendula MLA YS Jagan Oath
Pulivendula MLA YS Jagan Oath (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 2:56 PM IST

Updated : Jun 21, 2024, 3:08 PM IST

Pulivendula MLA YS Jagan Oath in Assembly: సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తొలిసారి తాడేపల్లి ప్యాలెస్‌ నివాసం నుంచి బయటకు వచ్చారు. అన్యమనస్కంగానే శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ నిస్తేజంగా కదిలారు. సభ్యునిగా తన పేరు ఉచ్ఛారణలో తడబడ్డారు. శాసనసభలో సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టం మొదలైన ఐదు నిమిషాల తర్వాత కానీ శాసనసభ ప్రాంగణానికి చేరుకోని జగన్‌ వరుస క్రమంలో తన పేరు వచ్చేంత వరకు సభలోపలికి రాలేదు.

మొదటిసారి బయటకొచ్చింది ఇప్పుడే: ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సభ్యుల వైపు నమస్కారం చేసుకుంటూ పోటెం స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లారు. మెట్లు ఎక్కుతూ తన వాచీలో సమయం చూసుకుంటూ మర్యాదపూర్వకంగా ప్రోటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరికి నమస్కారం చేశారు. తనదైన శైలిలో బుచ్చయ్యచౌదరి భుజం తట్టారు. సభ నుంచి శాసనసభలోని తన ఛాంబరుకు చేరుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి జగన్‌ బయటకొచ్చింది ఇప్పుడే.

కేవలం ఓ గంట పాటు మాత్రమే ఉండి తిరిగి తన ప్యాలెస్‌లోకి వెళ్లిపోయారు. అధికారపక్షం మొత్తం చాలా హుందాగా జగన్‌ విషయంలో వ్యవహరించినా అటువైపు నుంచి ఏ మాత్రం కనీస మర్యాద పాటించలేదని సభ్యులు గుసగుసలాడుకున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఇతర సీనియర్‌ సభ్యుల వద్దకు వచ్చి ప్రత్యక్షంగా అభినందనలు తెలిపి ఉంటే బాగుండేదని, అలా కాకుండా అహంకార ధోరణిలోనే సాగారే తప్ప హుందాగా మెలగలేదని భావిస్తున్నారు.

వెనుక గేటు నుంచి అసెంబ్లీకి వచ్చిన జగన్‌ - ప్రమాణం చేసి సభలో కూర్చోకుండానే! - Jagan Entered From Back Gate

ఆ తరువాత నేరుగా తాడేపల్లి ప్యాలస్‌కు: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టారు. సొంత సెక్యూరిటీతోనే అసెంబ్లీకి జగన్ వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. గత ప్రభుత్వంలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబరులోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో జగన్ కూర్చుండిపోయారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఆయనతో పాటు పక్కనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా కూర్చొన్నారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డి మిగతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ దండం పెడుతూ ఎమ్మెల్యేలు వెళ్లారు.

రెండున్నరేళ్ల తర్వాత సగౌరవంగా గౌరవ సభకు సీఎం చంద్రబాబు - cm chandrababu entered to assembly

వేరే మార్గంలో సభకు: ఇదే సమయంలో సీఎం చంద్రబాబుకు కూడా జగన్ నమస్కరించడంతో ఆయన ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణం చేసే సమయంలో తొలుత వైఎస్ జగన్మోహన్ అనే నేను అని పలికి ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని సవరించుకున్నారు. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ వెనుక గేటు నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మందడం మీదుగా పరదాలు, భారీగా పోలీసు బలగాల మోహరింపు మధ్య సభకు వచ్చేవారు. కానీ ఈసారి రూటు మార్చి అమరావతి రైతుల శిబిరం వైపు రహదారి నుంచి కాకుండా వెనుక నుంచి శాసనసభకి చేరుకున్నారు. రాజధాని రైతులు ఎక్కడ నిరసన తెలుపుతారనే భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది.

సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌ - AP Assembly Sessions 2024

జగన్‌ వ్యవహారశైలి ఏ విధంగా ఉన్నప్పటికీ అతనికి అగౌరవం కలిగేలా ప్రవర్తించరాదని తెలుగుదేశం శాసనసభ్యులకు చంద్రబాబు స్పష్టం చేయడమే కాకుండా జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణం లోపలకి అనుమతించాలని ఆదేశించారు. ప్రస్తుతం అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే లోపలకు రావాల్సి ఉంటుంది. ప్రతిపక్షం విషయంలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు అసెంబ్లీకి బయల్దేరే ముందే ఎమ్మెల్యేలకు సూచించారు.

చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని, శాసనసభలో రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని ఆదేశించారు. జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు తెలియజేశారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన తరుణంలో అందుకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించారు.

ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నారనేది చూడాలని ఎమ్మెల్యేలంతా ఎదురు చూశారని, తన రాజ్యం లాక్కున్నట్లు జగన్ భావిస్తున్నట్లు అతని ముఖ కవలికల్లో కనిపించిందని టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివారని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంత వరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదని అభిప్రాయపడ్డారు.

తొలిసారి అసెంబ్లీలోకి..- మాతృమూర్తి ఆశీస్సులు తీసుకున్న గుడివాడ ఎమ్మెల్యే రాము - Ramu Come to First Time in Assembly

అసెంబ్లీలో తడబడిన జగన్​ రెడ్డి- 'ఘోరఓటమి తరువాత ఇదే తొలిసారి (ETV Bharat)

Last Updated : Jun 21, 2024, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.