PudiLanka People Facing Problems With Road Facility: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామ ప్రజలకు రాకపోకలు సాగించేందుకు పడవే దిక్కు. తమకు రహదారి కావాలంటూ దశాబ్దాలుగా గ్రామస్థులు పాలకుల చుట్టూ తిరిగారు. గతంలో టీడీపీ హయాంలో కొంత మేర రహదారి నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రహదారి లేక ప్రమాదం అని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో బోటులో ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
ప్రతి చిన్న వస్తువుకి రెండు బోట్ల సాయంతో వెళ్లి రావాల్సిందే. పడవల మీద ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు లేకపోవడంతో ఇతర గ్రామ ప్రజలు ఇక్కడికి రావటానికి ఉండట్లేదు. తుపాన్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఎటూ వెళ్లలేని పరిస్థితి. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా బోట్లలోనే వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బోటు ఉంది కానీ గతంలో బోటు లేక నీళ్లలో దిగి ఈత కొట్టుకుంటూ వెళ్లవలసి వచ్చేది. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ తమ పరిస్థితిని పట్టించుకోవట్లేదు. -పూడిలంక గ్రామస్థులు.
వర్షాకాలం, అత్యవసర పరిస్థితుల్లో నానా పాట్లు పడుతున్నారు. బోటు ప్రయాణం వల్ల ప్రమాదాలు కూడా జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కోటి 30 లక్షల రూపాయలతో పూడిలంక గ్రామానికి రహదారి నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 400 మీటర్ల మీద పనులు జరిగాయి. కానీ నిధులు సరిపోక పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవేమి రోడ్లు బాబోయ్- ఏలూరు జిల్లాలో చుక్కలు చూపిస్తున్న రహదారులు - Damaged Roads in Eluru District