ETV Bharat / state

మాకు న్యాయం చేయండి - టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైఎస్సార్సీపీ బాధితులు - TDP Grievance Program Mangalagiri - TDP GRIEVANCE PROGRAM MANGALAGIRI

Public Grievance in Mangalagiri TDP Office : టీడీపీ కేంద్ర కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్​ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్​, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అర్జీలను స్వీకరించారు. బాధితుల నుంచి వచ్చిన వినతులన్నీంటిని సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చూపుతామని దరఖాస్తుదారులకు నేతలు హామీ ఇచ్చారు.

TDP Grievance Program Mangalagiri
TDP Grievance Program Mangalagiri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 10:36 AM IST

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌ కార్యక్రమం (ETV Bharat)

TDP Grievance in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పోటెత్తడంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు. ఈ క్రమంలోనే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి వారి అనుచరుల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా నరకం అనుభవించామని మాచర్ల నియోజకవర్గానికి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Heavy Applicants to TDP Grievance Program : పుట్టిన ఊళ్లకు దూరంగా దిక్కులేని వారిగా బతికామని బాధితులు నేతలకు తెలిపారు. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వస్తే ఎక్కడ చంపుతారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బతికామని వాపోయారు. పరారీలో ఉన్న వెంకట్రామిరెడ్డిని పట్టుకోవాలని, వారి అండ చూసుకొని పల్నాడును రావణకాష్టంలా మార్చిన వైఎస్సార్సీపీ వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సమస్యలు తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులతో నేతలు ఫొన్లో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు దక్షిణాఫ్రికాలో మోసపోయిన తన కుమారుడు ముప్పారాజు హరికృష్ణకు న్యాయసాయం అందించాలని ఇంకొల్లుకు చెందిన శ్రీనివాసరావు కోరారు. దక్షిణాఫ్రికాలో స్థానిక భారత సంతతి వ్యక్తి తన కుమారుడ్ని వేధిస్తున్నాడని చెప్పారు. దౌర్జన్యంగా రూ.80 లక్షల విలువైన బోర్లు వేసే డ్రిల్లింగ్‌ మిషన్, ట్రక్కు, కారు తదితర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై దక్షిణాఫ్రికా కోర్టులు తమకు అనుకూలంగా తీర్పు చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విషయంపై భారత దౌత్య అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని శ్రీనివాసరావు వారికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పల్లా శ్రీనివాసరావు బాధితుడికి సాయం చేయాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్‌ని ఆయన కోరారు.

గత సర్కార్ ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం పేరును కూటమి ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌గా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి అనేక సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకూ అండగా నిలుస్తుంది. ఇన్నేళ్లు వైఎస్సార్సీపీ నేతలకు భయపడి నలిగిపోయిన ప్రజలు, కూటమి విజయంతో తమకు జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

జగన్ హయాంలో నష్టపోయాం ఆదుకోండి - సీఎం చంద్రబాబుకు వినతులు - CM Chandrababu Receiving Requests

ప్రజలకు భరోసా కల్పిస్తోన్న ప్రజాదర్బార్ ​- నేనున్నానంటున్న నారా లోకేశ్ - Nara Lokesh Prajadarbar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.