PJTSAU Agriculture Diploma Notification : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ అగ్రికల్చర్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై, పాలీసెట్-2024 పరీక్ష రాసి, ర్యాంక్ పొంది ఉండాలి. ఈ కోర్సుల్లో మొత్తం 800 సీట్లు ఉండగా అందులో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో 260 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 540 సీట్లు ఉన్నాయి.
ముఖ్యమైన వివరాలు
- మొత్తం సీట్లు : 800
- ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో : 260 సీట్లు
- ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో : 540 సీట్లు
- అర్హత : పదో తరగతి, పాలీసెట్-2024లో అర్హత పొంది ఉండాలి
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : ఈ నెల 26 వ తేదీ
- అధికారిక వెబ్‌సైట్ : www.pjtsau.edu.in
Rural Quota- Non-rural Quota : మొత్తం పాలిటెక్నిక్ సీట్లలో 60 శాతం రూరల్ కోటా, 40 శాతం సీట్లు నాన్ రూరల్ కోటాలో భర్తీ చేస్తారు. రూరల్ కోటాలో సీటు పొందాలంటే విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏవైనా నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో చదివినట్లుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి ధ్రువీకరించిన పత్రాన్ని (Annexure 1) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రూరల్, నాన్ రూరల్ కోటాలోని సీట్లు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రభుత్వ నియమాలను అనుసరించి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ పి.రఘురామిరెడ్డి తెలిపారు.
దరఖాస్తు విధానం : ఈ కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తును ఈ నెల 26 సాయంత్రం 5 గంటలు లోగా చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్న ప్రదేశాలు, వివిధ కోర్సులు సంబంధించి ఫీజులు, ఇతర సమగ్ర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ : www.pjtsau.edu.in సందర్శించవచ్చని ఆయన చెప్పారు.
మానవ వనరులు అభివృద్ధి చేసే దిశగా.. ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలలు