ETV Bharat / state

ఏ బండ పడుతుందో- ఎప్పుడు ఏం జరుగుతుందో? భయం భయంగా జీవనం

విజయవాడ కొండ ప్రాంతాల్లో 2 లక్షల మంది జీవనం - ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడుతుందో తెలియక భయాందోళనలో జీవనం.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 5 minutes ago

people_problems_in_hilly_areas
people_problems_in_hilly_areas (ETV Bharat)

Problems of People Living in Hilly Areas at Vijayawada: చుట్టూ ఎత్తైన కొండలు దానిపైనే ఆవాసాలు. ఎప్పుడు ఏ బండ మీద పడుతుందో తెలియదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. ఏ అవసరమైనా ఆపసోపాలు పడుతూ మెట్లు దిగి కిందకు రావాల్సిందే. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ బతుకు వెళ్లదీస్తున్న బడుగులను వసతుల లేమి మరింత వేధిస్తోంది.

ఏ బండ పడుతుందో- ఎప్పుడు జారిపోతామో? భయం భయంగా జీవనం (ETV Bharat)

విజయవాడలోని బహుళ అంతస్తులు ఓ వైపు ఆకర్షిస్తుంటే ఇంకోవైపు కొండల్ని ఆవాసాలుగా మార్చుకున్న బడుగు జీవులు భారంగా బతుకులిడిస్తున్నారు. నగరంలోని వన్​టౌన్, మొగల్రాజ్​పురం, సొరంగ మార్గం, చిట్టి నగర్ ప్రాంతాల్లో నిలువ నిడ లేక చాలామంది కొండలపై ఇల్లు కట్టుకున్నారు. మరి కొందరు కొండ ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు. కొండలపై ఉన్న ప్రకృతి రమణీయత ఆహ్లాదకరంగా ఉన్నా ప్రతీ పనికి వందల మెట్లు దిగాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూలీ పనులకు వెళ్లే వాళ్లు, విద్యార్థులు, వృద్థులు ఇలా ప్రతీ ఒక్కరూ రోజుకు దాదాపు 600 మెట్లు ఎక్కి దిగలేక అల్లాడిపోతున్నామని వారు వాపోతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళలను కుర్చీల ద్వారా ఆసుపత్రులకు, ఇళ్లకు తీసుకెళ్తున్నామని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్కల బెడద ఉందని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకొవండం లేదని వారు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ ప్రాంతాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయని స్థానికులు చెపుతుననారు.

ఎప్పుడు రాళ్లు దొర్లిపడతాయని ఆందోళన: వానాకాలం వస్తే చాలు ఎక్కడ కొండచరియలు విరిగిపడతాయో అనే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. కొన్ని చోట్ల రోడ్లు, మురుగు కాలువలు సరిగ్గా లేవని తెలిపారు. కొన్ని కాలనీల్లో మెట్లు తోలగించి రోడ్లు వేశారని అంటున్నారు. ప్రస్తుతం నరగంలో ఇంటి అద్దెలు తారాస్థాయికి చేరాయని దింతో ఎంతోమంది పేదలు గుట్టలు, కొండలపై తల దాచుకుంటున్నారు. దాదాపు 2 లక్షల మంది కొండలపై ఆవాసులు చేసుకుని కష్టాలు పడుతున్నారు. వర్షం వస్తే ఎప్పుడు రాళ్లు దొర్లిపడతాయని ఆందోళన చెందుతున్నారు. కొండ ప్రాంతాల్లో దెబ్బతిన్న మెట్ల మరమ్మతులు చేయడంతో పాటు మౌళిక సదుపాయాలను కల్పించాలని స్ధానికులు కొరుతున్నారు.

డబ్బుల కోసమే లోకో పైలట్‌ హత్య- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో మద్యం దుకాణాలకు 90వేల దరఖాస్తులు! - అత్యధికంగా ఆ జిల్లా నుంచే

Last Updated : 5 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.