ETV Bharat / state

వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు - భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు - DUSSEHRA SHARANNAVARATRI IN AP

రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు - అమ్మవారిని వివిధ పదార్థాలతో అలంకరించిన భక్తులు.

dussehra_sharannavaratri_in_ap
dussehra_sharannavaratri_in_ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 8:58 PM IST

Updated : Oct 12, 2024, 9:18 PM IST

Dussehra Sharannavaratri Mahotsavs in AP: దసరా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శరన్నవరాత్రుల్లో చివరిరోజైన విజయదశమి పర్వదినాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలుచోట్ల అమ్మవారికి చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి. విజయనగరంలో పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర, సారెతో పాటు ఘటాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ బురుజుపేటలో నెలవైన శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారిని యాపిల్‌, దానిమ్మ, బత్తాయి, కమల, ద్రాక్ష ఫలాలతో అలంకరించారు.

వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు - భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు (ETV Bharat)

రూ.32 లక్షల కరెన్సీతో అలంకరణ: 12వ శక్తిపీఠం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయాలతో పాటు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసిన పందిళ్లకు వెళ్లి భక్తులు కుంకుమ పూజలు, అర్చనలు నిర్వహించారు. ముమ్మిడివరం ఆర్యవైశ్య సంఘం కల్యాణ మండపంలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రూ.32 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. మహిళలు గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు.

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు - భారీగా తరలి వచ్చిన భక్తులు

డ్రై ఫ్రూట్స్‌తో అలంకరణ: ముమ్మిడివరం నియోజకవర్గంలోని చినకొత్తలంకలో అమ్మవారిని డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించారు. రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గ అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, శక్తి వేషాలు, తీన్మార్‌ డప్పులతో గ్రామోత్సవం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తనీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. మహిళలు కుంకుమ, గాజులతో ప్రత్యేక పూజలు చేశారు.

జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు: ఏలూరులోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలను రంగు రంగుల పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. రాజరాజేశ్వరిదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించి దుర్గమ్మ సేవలో తరించారు. సౌభాగ్యలక్ష్మి ఆలయంలో యాగం నిర్వహించారు. కర్నూలులోని పలు కనకదుర్గమ్మ ఆలయాలు భక్తుల రాకతో కిక్కిరిశాయి. భక్తులు జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దాని చుట్టూ వాహనాలను తిప్పారు.

అమెరికాలో మహోత్సవాలు: అమెరికాలోని తెలుగువారు దసరా మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఓ కుటుంబం దసరా వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది.

దసరా స్పెషల్​: ఘుమఘుమలాడే మద్రాస్​ స్టైల్​ "మటన్​ బకెట్​ బిర్యానీ" - తిన్నారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!!

"రూ.2.3కోట్ల కట్టలు, నాణేల కుప్పలు" - భారీగా తరలివచ్చిన భక్తులు

Last Updated : Oct 12, 2024, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.