పని చేస్తున్న టీచర్లను తొలగించి, కొత్త పోస్టులకు బేరం పెట్టారు! వెలుగులోకి వచ్చిన జగన్ హయాం నాటి బాగోతం - YSRCP LEADER CHEATED UNEMPLOYED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2024, 7:54 PM IST

YSRCP Leader Fraud in the Name of Jobs: వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో జగన్​తో సన్నిహితంగా ఉన్న వారితో పరిచయాలు ఉన్నాయని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తమను మోసం చేశారని కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. విచారణ జరిపించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం 2019లో ఆదర్శ పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని తొలగించింది. ప్రకటన విడుదల చేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. ఈ క్రమంలో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరూ మోడల్ స్కూల్ గెస్ట్ టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. 

యూనియన్ రాష్ట్ర నాయకులు మదనపల్లికి చెందిన మమత, శ్రీకాకుళంకు చెందిన అనితలు నాటి సీఎం జగన్​తో సన్నిహితంగా ఉన్న ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయాలు ఉన్నాయని చెప్పి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 4 లక్షల 40 వేల రూపాయలు వసూలు చేశారని చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బాధితులు 8 మంది ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 120 మంది వరకు ఉన్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.