ETV Bharat / state

ప్రయాణం వేల జర పైలం - ఏమరపాటుగా ఉన్నారో మీ వస్తువులు ఆగం - Travel Safety Tips In Telugu - TRAVEL SAFETY TIPS IN TELUGU

దసరా సెలవుల నేపథ్యంలో బస్టాండ్​ల​లో పెరిగన రద్దీ - ఆసరాగా మార్చుకుంటున్న దొంగలు - అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు

Precautions to be Taken While Traveling
Precautions to be Taken While Traveling (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 2:20 PM IST

Precautions to be Taken While Traveling : తెలంగాణలో ప్రధాన పండుగ దసరా, అందులోనూ సెలవులు విద్యార్థులు, ఉద్యోగులు ఊరి బాట పడుతుంటారు ఇప్పుడు. లేదా సెలవుల కారణంగా పిల్లలతో పర్యాటక ప్రదేశాలకో, లేక ఆలయాలను చూడడానికి వెళ్తుంటారు. బస్సుల్లో, ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ నేపథ్యంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏ మాత్రం కాస్త జాగ్రత్తగా లేకపోయినా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశముంది. కాగా చోరీలు జరగడానికి కారణాలు, ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ కథనం

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కరీంనగర్ రీజియన్​లో పరిధిలో రోజుకు గతంలో 2లక్షల మంది ప్రయాణించగా పండుగ కారణంగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 5లక్షలు వరకు పెరిగింది. రద్దీ విపరీతంగా పెరిగిపోయిన కారణంగా దొంగతనాలు పెరిగిపోయాయి.

  • కరీంనగర్​ బస్టాండ్​లో చోరీలు పెరిగిపోతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  • ఆదివారం రాజన్న సిరిసిల్ల నుంచి మంథని వెళ్లే క్రమంలో కరీంనగర్​లో దిగిన ఓ ప్రయాణికురాలి బ్యాగులోంచి బంగారు ఆభలణాలు దొంగలించారు, సీసీ టీవీ ఫుటేజిని పోలీసులు పరిశీలించగా వివరాలు తెలియలేదు.
  • ఓ ప్రయాణికురాలు సీటులో బ్యాగు ఉంచి తిరిగి వచ్చే సరికి మాయమైంది.
  • బస్​స్టాండు పరిధిలో ఓ మహిళా తాళి చోరీకి గురైంది. ఫోన్​లు, ల్యాప్​టాప్​లు అపహరణకు గురవుతున్న ఘటనలూ ఉన్నాయి. వీటిని వెతికి పెట్టడం ఆర్టీసీ భద్రత సిబ్బందికి, పోలీసులకు తలనొప్పిగా మారింది.

పోలీసుల గస్తీ పెంచాలి : ప్రయాణ ప్రాంగణాల్లో ఆర్టీసీ భద్రతా సిబ్బందితోపాటు పోలీసు పహారా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులను అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మఫ్టీలో మహిళా పోలీసు సిబ్బందిని నియమిస్తే ఎలాంటి ఘటనలు చోటుచేసుకోవంటున్నారు. నాణ్యమైన సీసీ నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎదైనా ఘటన జరిగితే తమ దృష్టికి తేవాలని భద్రతా అధికారి రమణ ప్రయాణికులను కోరారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే బెటర్ :

  • ప్రయాణికులు ఎప్పటికప్పుడు లగేజీ, సెల్​ఫోన్లు, పర్సులు చెక్ చేసుకుంటూ ఉండాలి.
  • ఎక్కువ మంది బస్టాండ్​లో బెంచీలపై, బస్సుల్లో సీట్లపై కూర్చోని ఫోన్లలో మునిగిపోతుంటారు. కనీసం పక్కన ఎవరున్నారు? బ్యాగులు ఉన్నాయా లేదా అన్నది కూడా గమనించరు. అవసరమైతేనే ఫోన్ చూడాలి కాస్త ఎమరుపాటుగా ఉన్నా వస్తువులు అపహరణకు గురవుతాయి.
  • తెలియని వ్యక్తులు ఇచ్చేవి తినకూడదు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా సిబ్బందికి సమాచారమివ్వాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.