ETV Bharat / state

ఏడాదిలో సగం చోరీలు వేసవిలోనే జరుగుతున్నాయట - మీరు ఎక్కడికైనా వెళ్తే ఇల్లు జాగ్రత్త సుమీ! - Precautions Against Thieves Summer

Precautions Against Thieves in Summer : వేసవి సరదాలనే కాదు, దొంగల బెడదనూ తెచ్చిపెడుతుంది. సంవత్సరంలో జరిగే చోరీ కేసులో సుమారు సగం ఆ ఒక్క సీజన్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. సెలవుల్లో సొంతూరు ప్రయాణాలు, శుభకార్యాల సందళ్లు, ఆరుబయట నిద్రలు చోరుల చేతివాటానికి కారణంగా నిలుస్తున్నాయి. కనీస జాగ్రత్తలతోనే ఇల్లు గుల్ల కాకుండా కాపాడుకోగలం. అవి ఏమింటో తెలుసుకుందాం.

How to Protect from Thieves in Summer
Precautions Against Thieves in Summer
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 3:28 PM IST

Precautions Against Thieves in Summer : వేసవి వచ్చిందంటే ఎక్కువ మంది వేరే ఊరు వెళ్లేందుకు మక్కువ చూపుతారు. ఇదే అదునుగా చూసుకోని చోరులు రెచ్చిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగతనాలు ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా రాత్రిపూట దుండగులు సొత్తు క్షణాల్లో మాయం చేస్తున్నారు. 2022లో మొత్తం 474 దొంగతనాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఒక్క వేసవి (మార్చి, ఏప్రిల్‌, మే)లోనే 255 (54%) ఘటనలు(Theft Cases in Summer) చోటుచేసుకోవడం గమనార్హం. అందునా రాత్రిపూట జరిగిన చోరీలు 127. 2023లోనూ ఇదే రిపీట్​ అయింది. ఒక్క వేసవి సీజన్‌లో ఏకంగా 148 (39%) దొంగతనాలు జరగగా, వాటిల్లో రాత్రిపూట చోటుచేసుకున్నవి 137.

దొంగలున్నారు జాగ్రత్త - భాగ్యనగర వాసులను కలవరపెడుతున్న వరుస చోరీలు - Robbery Incidents in Hyderabad

Suggestions to Protect from Thieves Summer : పగలంతా రెక్కీ రాత్రయితే చోరీ షరామామూలైంది. ముఖ్యంగా తాళం వేసి ఉన్న నివాసాలే దుండగుల లక్ష్యాలుగా మారుతున్నాయి. పగలు, రాత్రీ అనే తేడా లేకుండా పోలీసు పెట్రోలింగ్‌ కొనసాగుతోందని పోలీస్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, కొంతమంది చేసే చిన్నచిన్న తప్పిదాలే దొంగలకు అవకాశాలుగా మారుతున్నాయన్నది నమ్మలేని నిజం. ఎవరైనా ఊరెళ్తే పొరుగువారిని అప్రమత్తం చేయటం, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం మరిచిపోతున్నారు. ముఖ్యంగా ఇంట్లో నగదు, నగలు దాచిపెడుతున్నారు. సొత్తు రికవరీ శాతం తగ్గుతున్న తరుణంలో, ఈ వేసవిలో ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష.

పట్టపగలే దొంగల బీభత్సం- రూ.7లక్షలు లూటీ- సినీ ఫక్కీలో ఫ్యామిలీ కిడ్నాప్​ - Robbery In Dehradun

Police Tips to protect from Thieves : చోరీల విషయంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్​ రాజు తెలిపారు. శాఖాపరంగా పెట్రోలింగ్‌, గస్తీని పెంచుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా కొద్దిరోజులు ఊరెళ్లాల్సి వస్తే సమీప బంధువు, లేదా కుటుంబంలో ఎవరో ఒక సభ్యుడిని ఇంట్లో ఉంచడం మేలని సూచించారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే విలువైన ఆభరణాలు, ఎక్కువ మొత్తంలో నగదును ఇంట్లో ఉంచవద్దన్నారు. తలుపులకు మామూలైనవి కాకుండా పూర్తి భద్రతతో కూడిన తాళాలు వినియోగించాలని వివరించారు.

ఆన్​లైన్ గేమ్స్ కోసం ఇంట్లో నగలు చోరీ - దొంగలు ఎత్తుకెళ్లారని కట్టుకథ - చివరి ట్విస్ట్ మాత్రం అదుర్స్! - Online Games Crime

Suggestions to Avoid Theft Summer : ఎవరైనా వేరు ఊరు వెళ్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో చిరునామా, వివరాలు తెలిపితే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ విస్తృతం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. బీరువాలో సొత్తు ఉంచి తాళాలను పోపు డబ్బాలు, దిండ్లు, సామగ్రి కింద, ఆరుబయట ఎక్కడో ఒకచోట దాచిపెట్టే పద్ధతులు మార్చుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చుట్టుపక్కల వారు వెంటనే ‘100’(Dial 100)కి కాల్​ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రధాన కాలనీల్లో స్థానికులంతా కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం మంచిదని హితువు పలికారు.

పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ ముఠా - కారులో వెళ్తున్న యువకుడిపై దాడి చేసి బంగారం చోరీ - Rajendra Nagar chain snatching case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.