Rythu Runa Mafi in Telangana : రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం అమలుపై పర్యవేక్షణ కోసం వ్యవసాయ శాఖ, ఎన్ఐసీ కలిసి ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నాయి. స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించేలా రూపొందించిన ఈ మార్గదర్శకాల ప్రకారం స్వయంసహాయక బృందాలు, రైతుమిత్ర గ్రూపులు, కౌలు రైతులకు రుణమాఫీ వర్తించదు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్యను తగ్గించేందుకే పీఎం కిసాన్, రేషన్ కార్డుల నిబంధనలు ముందుకు తెచ్చారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ మార్గదర్శకాలతో ఎంత మంది రైతులు లబ్దిపొందుతారు? బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంటరుణాలు మాఫీ అవుతాయా? మార్గదర్శకాలపై వస్తున్న అభ్యంతరాలు ఏమిటి? అనేవి ప్రతిధ్వని ద్వారా తెలుసుకుందాం.
రేపే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బు - ఈ పథకానికి అర్హులు ఎవరు? - Pratidhwani ON RYTHU RUNA MAFI
Pratidhwani Debate on Rythu Runa Mafi In Telangana : తెలంగాణ రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీపై సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే దీనిపై సందేహాలు ఉన్నవారు చాలమందే. అవన్నీ ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.
Published : Jul 17, 2024, 9:47 AM IST