ETV Bharat / state

బెయిల్​ కోసం హైకోర్టును ఆశ్రయించిన ప్రత్తిపాటి కుటుంబం - కష్టడీకి పోలీసులు అప్పీల్ - Prathipati Pullarao Family Petition

Prathipati Pullarao Family Petitions: అవెక్సా కార్పొరేషన్ సంస్థ జీఎస్టీ ఎగవేత, బోగస్ ఇన్వాయిస్​లతో నిధులు మళ్లించారన్న వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ మాజీమంత్రి ప్రత్తిపాటి కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ప్రత్తిపాటి శరత్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ అత్యవసరంగా పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది.

Prathipati_Pullarao_Family_Petitions
Prathipati_Pullarao_Family_Petitions
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 9:27 AM IST

Prathipati Pullarao Family Petitions: అవెక్సా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ జీఎస్టీ ఎగవేత, బోగస్‌ ఇన్వాయిస్‌లతో నిధులు మళ్లించిందనే ఆరోపణలతో ఏపీ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌(ఏపీఎస్‌డీఆర్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ మాచవరం పోలీసులు ఫిబ్రవరి 25న నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకాయమ్మ, కుమార్తె ప్రత్తిపాటి స్వాతి, బొగ్గవరపు అంకమ్మరావు, కుర్రా జోగేశ్వరరావు, బొగ్గవరపు నాగమణి బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ఎండీ బలుసు శ్రీనివాసరావు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాజకీయ కారణాలతో కేసు నమోదుచేశారని, అరెస్టు చేసే ప్రమాదం ఉన్నందున సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని సీనియర్‌ న్యాయవాది బి ఆదినారాయణరావు, న్యాయవాదులు వివి సతీష్, జవ్వాజి శరత్‌చంద్ర, కిలారు నితిన్‌ కృష్ణ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.

గద్దె దిగే సమయంలోనూ జగన్ విధ్వంసం, విద్వేషం కొనసాగిస్తున్నాడు : ప్రత్తిపాటి

కష్టడీ నిరాకరణపై హైకోర్టులో పోలీసులు అప్పీల్: మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడు ప్రత్తిపాటి శరత్‌ను విచారణ నిమిత్తం పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనను విజయవాడ ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవాలు చేస్తూ అత్యవసరంగా పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిందితుడు శరత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. బెయిలు పిటిషన్‌పై విజయవాడ కోర్టు విచారణ చేయకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారన్నారు.

కస్టడీ వ్యవహారంపై హైకోర్టులో పెండింగ్‌ ఉందన్న కారణం చెప్పి, బెయిలు పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని కోరే దురుద్దేశం పోలీసులకు ఉందన్నారు. ఈ వాదనలపై న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు స్పందిస్తూ దిగువ కోర్టు విచారణపై తాను ఎలాంటి స్టే ఇవ్వలేదని, బెయిలు ఇవ్వాలా? వద్దా? అనేది సంబంధిత కోర్టు న్యాయవాధికారి విచక్షణాధికారం అని పేర్కొన్నారు. పోలీసులు వేసిన అప్పీల్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

టీడీపీ నేతలపై కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు- పత్తిపాటి కుమారుడి అరెస్టులో జగన్ సర్కార్ అత్యుత్సాహం

శరత్‌ బెయిల్‌పై విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు: బోగస్‌ బిల్లులతో అక్రమంగా ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందారన్న వ్యవహారంలో కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు పూర్తి అయిందని, ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి శరత్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కిలారు బెనర్జీ వాదించారు. పన్ను ఎగవేత, డొల్ల కంపెనీలతో నిధుల దారిమళ్లింపు కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్టు అయి, రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. శరత్‌కు బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది బెనరీ విజయవాడలోని ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మేజిస్ట్రేట్‌ కరీముల్లా ఎదుట పిటిషనర్‌ తరఫు న్యాయవాది గురువారం తన వాదనలు వినిపించారు.

అవెక్సా కార్పొరేషన్‌లో నిందితుడు కేవలం 67 రోజులు మాత్రమే ఉన్నారని, ఆ సమయంలో జరగని అక్రమాలకు ఎలా బాధ్యుడిని చేస్తారని అన్నారు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని, ఇప్పటికే ప్రభుత్వం వద్ద కేసుకు సంబంధించి అన్ని రికార్డులు ఉన్నాయన్నారు. బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న వాదనల్లో నిజం లేదన్నారు. సాక్షులు ప్రభుత్వ అధికారులని, వారిని ప్రభావితం చేసే అవకాశం ఎంత మాత్రం లేదని వాదించారు.

పైగా మాచవరం పోలీసులు ఇప్పటికే శరత్‌ పాస్‌పోర్టును సీజ్‌ చేశారని, ఎక్కడికీ పారిపోయే అవకాశం కూడా లేదన్నారు. బెయిల్‌ పిటిషన్‌పై పోలీసుల తరఫున పీపీ కౌంటరు దాఖలు చేశారు. అక్రమాలు నిందితుడు శరత్‌కు తెలిసే జరిగాయని అందులో పేర్కొన్నారు. ఆయన ప్రోద్బలంతోనే నిధులు దారిమళ్లాయని, విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఈ దశలో బెయిల్‌ ఇవ్వొద్దని కౌంటర్‌లో కోర్టును అభ్యర్థించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించేందుకు గాను సోమవారానికి న్యాయాధికారి కరీముల్లా వాయిదా వేశారు.

శరత్​ అరెస్టు అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.