Prathidwani on Farmer Loan Waiver Scheme in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ పథకం అమలుకు తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. అర్హతలు, మినహాయింపులు, లబ్దిదారుల ఎంపిక విషయంపై లోతుగా అధ్యయనం చేస్తోంది. రుణమాఫీ అమలు కోసం వేల కోట్ల రూపాయల నిధులు సేకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ పథకం విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయి? అన్నదాతలకు వ్యవసాయం పై భరోసా ఏర్పడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రైతుబీమా, పంటల బీమా, ధరల స్థిరీకరణలో మెరుగుపర్చుకోవాల్సిన అంశాలేంటి?
Rythu Runa Mafi Scheme in Telangana : రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం విధివిధానాలు ఎలా ఉండవచ్చు? గతంలో రుణమాఫీ పథకం అమలు అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు నిబంధనలు ఎలా ఉంటే మేలని రైతులు, రైతుసంఘాలుగా కోరుకుంటున్నారు? రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కూడా రైతు రుణమాఫీనే అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉండబోతందని అందరి అంచనా. ఈ విషయంలో ప్రభుత్వానికి మేధావులు ఏం సూచిస్తున్నారు? రుణమాఫీ పథకంతో సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు లబ్ది చేకూర్చాలన్నది తమ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
CM Revanth Reddy on Runa Mafi : పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా మార్గదర్శకాలు ఎలా ఉంటే మేలు? రైతుల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఎంతోకాలంగా అధ్యయనాలు చేస్తున్నారు. రుణమాఫీ వంటి పథకాలతో ఆ విషయంలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంటుంది? రుణమాఫీతో పాటు రైతు, పంటల బీమా వంటి పథకాల ద్వారా అన్నదాతలకు ఎలాంటి భద్రత చేకూరుతుంది? రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు ఇంకా ఎలాంటి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఇన్‌పుట్ సబ్సిడీలు అందించడం నుంచి మార్కెట్లో ధరల స్థిరీకరణ వరకు ఎలాంటి సమగ్ర విధానం ఉంటే రైతులకు ఆర్థికంగా మరింత భరోసాను ఇవ్వొచ్చు? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని.