Prahallada Darshan Restricted In Kadiri Temple : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆలయంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలోని భక్తులకు ఆరాధ్య దైవం. ఈ ఆలయంలో అనేక మంది ముస్లింలు కూడా మొక్కులు తీర్చుకోడానికి దర్శనానికి వస్తుండటం విశేషం. ఈ ఆలయం గర్బగుడిలో ఓ వైపు నరసింహస్వామిని, మరోవైపు ప్రహల్లాదుడిని ప్రతిష్టించారు. ఆలయానికి వెళ్లిన వారు ప్రహ్లాద సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే కరోనా అనంతరం ఆలయ అధికారులు గర్భగుడి రెండో తలుపు వెలపలే భక్తులను తిరిగి పంపించేలా దూరదర్శనం ఏర్పాటు చేశారు. దీనివల్ల మూలవిరాట్ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం పక్కనే ఉన్న ప్రహ్లాదుడి విగ్రహం భక్తులకు కనిపించడంలేదు. ప్రహ్లాద సమేతంగా స్వామి దర్శనం లభించకపోవడంతో కదిరి ఆలయానికి వచ్చిన భక్తులు అసంతృప్తిగా తిరిగివెళ్లాల్సి వస్తోంది.
కరోనాని సాకుగా చూపి అభివృద్ధి గాలికి : కదిరి లక్ష్మీనరసింహ స్వామిని అత్యంత మహిమాన్విత మూర్తిగా రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు భక్తులు కొలుస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంమైన కదిరి దేవాలయానికి స్థల పురాణం ప్రకారం ఎంతో విశిష్టత కలదు. కానీ గత ప్రభుత్వం మాత్రం కదిరి ఆలయ నిర్వహణను గాలికి వదిలేశారు. ఈ క్రమంలో ఆలయ పరిసరాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ అభివృద్ధి గురించి ఎవరూ ప్రశ్నించినా కరోనా మహమ్మారిని వైఎస్సార్సీపీ నాయకులు సాకుగా చూపించే వారు.
పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసర ఉత్సవాలు - ఇక హంస వాహనంపై ఉత్సవమూర్తులకు పూజలు
అక్రమాలపై ఎప్పటికప్పుడు పోరాటం : కదిరి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాల కొరత పాటు ప్రహ్లాదుడిని దూరం చేశారు. ఆలయ అధికారులు వీఐపీలకు మాత్రం గర్భగుడి దగ్గరకు తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారు. సామాన్య భక్తులకు మాత్రం స్వామి వారిని దూరం చేశారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో కొంత మంది భక్తులు ఖాద్రి నరసింహ ఆలయ రక్షకదళ్ పేరుతో ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తునే ఉన్నారు. స్వామి వారి ఆలయంలో జరిగే అపచారాలను నిలదీస్తూ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఎన్ని విజ్ఞప్తులు చేసినా లాభం లేదు : భృగు తీర్థం కోనేరు పునర్నిమాణంలో కోట్ల రూపాయలను కాజేసిన వైఎస్సార్సీపీ నాయకులపై పోరాటం చేస్తోంది. గర్భగుడిలో ప్రహాల్లాదుడి విగ్రహం కనిపించకుండా దర్శనం ఏర్పాటుపై ఆలయ అధికారులను ఎప్పటికప్పుడు నిలదీస్తూ వస్తున్నారు. ప్రహ్లాదసమేతంగా స్వామి వారిని దర్శనం చేసుకుంటునే పాపపరిహారం ఉంటుందని స్థల పురాణం చెబుతుంది. ఆలయ అధికారులు మాత్రం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఖాతరు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అయిన ప్రహ్లాదసమేతంగా స్వామి వారి దర్శనం కల్పించాలని కోరుకుంటున్నారు.
శ్రీమహాచండీ అలంకారంలో కనకదుర్గమ్మ - వేద పండితులు ఏం చెప్తున్నారంటే! - Navaratri celebrations 5th day