Ponnur EX MLA Kilaru Roshaiah Resign to YSRCP : గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పై రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు.
‘వైఎస్సార్సీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలో కనీసం చర్చించలేదు. మండలిలో చైర్మన్ అన్నారు, ప్రతిపక్ష నేతగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. కొందరు మానసికంగా కుంగదీశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నారు. వైఎస్సార్సీపీ లో నేను కొనసాగలేను’ -రోశయ్య
ఎమ్మెల్యే నుంచి తనను ఎంపీగా పంపిన తర్వాత పార్టీ అధ్యక్షుని సూచనతో పోటీ చేశానని తెలిపారు. పార్టీ ఓటమికి కృషి చేసిన వారికే అక్కడ పదోన్నతులు కల్పిస్తూ వెళ్తున్నారన్నారని ఆరోపించారు. ఇటీవల అతనికే మండలిలో ప్రతిపక్ష నేతగా పదోన్నతి కల్పించారన్నారని అన్నారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కనీస గుర్తింపు వైఎస్సార్సీపీలో లేదని తెలిపారు. ఎంతో కాలంగా తాను గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నానన్నారు, అయినా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారికే గుర్తింపు తప్ప కష్టపడేవారికి లేదన్నారు. అందువల్లనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. త్వరలో అనుచరులతో చర్చించుకుని భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
ఇప్పటికే కేవలం 11 సీట్లకు పరిమితమయ్యారు. కనీసం ప్రతపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయారు. ఘోర పరాజయం తరువాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల వైఖరి మారలేదు. అసెంబ్లీ ఎదుట జగన్ నల్ల కండువాతో నిరసన చేశారు. అడ్డుకున్న పోలీసులపై మండిపడ్డారు. నేడు దిల్లీలో నిరసన చేపట్టారు. ఓడిపోయినా పార్టీ పోకడలు మారడం లేదని నేడు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య రార్టీకి రాజీనామా చేశానన్నారు.