ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి- సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా - Polling Arrangements for Elections - POLLING ARRANGEMENTS FOR ELECTIONS

Polling Arrangements for AP Elections 2024: కాసేపట్లో ప్రారంభంకానున్న పోలింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రంగం సిద్ధమైంది. ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను ఆదివారానికే పూర్తి చేసిన అధికారులు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలవారీగా ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల వివరాలను ఓసారి చూద్దాం.

Polling_Arrangements_for_AP_Elections_2024
Polling_Arrangements_for_AP_Elections_2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 6:41 AM IST

Updated : May 13, 2024, 6:56 AM IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి- సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా (ETV Bharat)

Polling Arrangements for AP Elections 2024: అనంతపురం జిల్లాలో మొత్తం 20లక్షల 18వేలమంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 2వేల 236 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 662 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 16లక్షల 56వేలమంది ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ మొత్తం 15వందల 71 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 299 సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. వీటిపై కేంద్ర బలగాలతోపాటు, స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఉమ్మడి వైఎస్సార్​ జిల్లాలో 16లక్షల 29వేలమంది ఓటర్లున్నారు. 2వెల 37 పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ కోసం 14వేలమంది సిబ్బందిని అధికారులు నియమించారు. జిల్లాలోని 527 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 4వేలమంది పోలీసులతో జిల్లావ్యాప్తంగా బందోబస్తు నిర్వహిస్తుండగా 900మంది కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.

జగన్‌ హయాంలో అరాచకాలకు అడ్డాగా ఆంధ్రా - విధ్వంసపు పాలనలో మానని గాయాలెన్నో! - YSRCP Govt Anarchies in AP

నెల్లూరు జిల్లాలో 20లక్షల 61వేల 822మంది ఓటర్లు ఉండగా వీరి కోసం 2వేల 470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20వేలమంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ప్రకాశం జిల్లాలో మొత్తం 18లక్షల 22వేల 470 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం 2వేల 183 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 14వేల 768 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు.

పల్నాడు జిల్లాలో మొత్తం 17లక్షల 20వేల 526 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 19వందల 29 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 15వేలమంది పోలింగ్‌, 4వేలమంది భద్రతా సిబ్బందిని నియమించారు. మరోవైపు నరసరావుపేటలో కేంద్ర బలగాలు కవాతు చేశాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ బిందు మాధవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓటర్లలో భరోసా కలిగించేందుకే ఈ ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించామని కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు.

రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati

ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 17లక్షల 4వేలమంది ఓటర్లు ఉన్నారు. 17వందల 92 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 100 శాతం వెబ్‌ కాస్టింగ్‌ ఉంటుందని కలెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం కుర్చీలు, వీల్‌ఛైర్స్‌ అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. వీటిలో 267 ప్రాంతాలను శాంతిభ‌ద్రత‌ల ప‌రంగా సమస్యాత్మకంగా గుర్తించామ‌ని విజయవాడ సీపీ రామకృష్ణ తెలిపారు. ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని రామకృష్ణ కోరారు.

కాకినాడ జిల్లాలో 16లక్షల 34వేల 122 మంది ఓటర్లు ఉన్నారు. 16వందల 40 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 331 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా 15లక్షల 62వేలమంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ నిర్వహణకు 18వందల 47 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణకు 17వేల 600మందిని అధికారులు నియమించారు. 362 పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా పోలీసులు గుర్తించారు. గతంలో కంటే ఈసారి పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేశామని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్లు 7లక్షల 83వేల 440 మంది కాగా వారిలో మహిళలు అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం వెయ్యి 31 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 219 కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు.

Last Updated : May 13, 2024, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.