ETV Bharat / state

ప్రజా గొంతుకై మోగిన నిలువెత్తు అక్షరసేనానికి అశ్రునివాళి - Politicians Tribute to Ramoji Rao Demise - POLITICIANS TRIBUTE TO RAMOJI RAO DEMISE

Politicians Tribute to Ramoji Rao Demise : రామోజీ రావు అకాల మరణం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి చెందారు. రామోజీ రావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా రంగంలో ఆయన సేవలను కొనియాడుతూ సంతాపం ప్రకటించారు.

governor_justice_abdul_nazeer_tribute_to_ramoji_rao_demise
governor_justice_abdul_nazeer_tribute_to_ramoji_rao_demise (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 2:51 PM IST

Updated : Jun 8, 2024, 4:33 PM IST

ప్రజా గొంతుకై మోగిన నిలువెత్తు అక్షరసేనానికి అశ్రునివాళి (ETV Bharat)

Governor Justice Abdul Nazeer Tribute to Ramoji Rao Demise : ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు మృతిపై గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సంతాపం తెలిపారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని కొనియాడారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. రామోజీరావు తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారన్న జగన్‌ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Politicians Tribute to Ramoji Rao Demise : ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణంపై తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకై ప్రభుత్వాల మీద తన అక్షరమనే ఆయుధంతో పోరాటం చేసి యావత్‌ దేశ ప్రజల మన్ననలను పొందారని గుర్తు చేశారు.

అక్షరయోధుడు రామోజీరావు అస్తమయం పట్ల టీడీపీ సీనియర్ నేత కనక మేడల రవీంద్ర కుమార్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. పాత్రికేయ, సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారన్న కనకమేడల రామోజీ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రామోజీరావు కీర్తి అజరామరం: చంద్రబాబు - Chandrababu On Ramoji Rao Demise

‍రామోజీరావు లెజెండ్ అని ఆయన అస్తమించడం దేశానికి నష్టమని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. రామోజీరావు పార్థివదేహానికి కావూరి సాంబశివరావు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శ్రీరామ్ నివాళులర్పించారు. తమ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయమని సునీత, శ్రీరామ్ ఆవేదన వ్యక్తంచేశారు. రామోజీరావు మరణం తెలుగు ప్రజలకి తీరని లోటని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు'- రామోజీ అస్తమయంపై ముర్ము, మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - Modi On Ramoji Rao Demise

రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి తెలియజేశారు. ప్రతి తెలుగింటితో రామోజీరావుకి అనుబంధం విడదీయలేనిదని కోనియాడారు. ప్రతి తెలుగు గడప ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.

Last Updated : Jun 8, 2024, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.