Political Strategist Prashanth Kishore Comment on Election Result : ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
పదేళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించినవారు ఎవరూ కనిపించలేదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి అని తెలిపారు. మున్ముందు రౌండ్లలో మాకు మెజార్టీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గెలుస్తామని చెబితే, సీఎం జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారని, ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు.
'గెలిపించినోడే ఓడిపోతావని గేలి చేస్తున్నాడు'- జగన్, పీకే బంధంపై ట్వీట్లు వైరల్
దేశవ్యాప్త ఎన్నికల్లో బీజేపీ లోగడ కంటే సీట్లు తగ్గవని ప్రశాంత కిశోర్ సృష్టం చేశారు. దేశంలో బీజేపీ, మోదీలపై అసంతృప్తి ఉంది తప్పితే ఆగ్రహం లేదని ఆయన వెల్లడించారు. అందువల్ల ఈసారి బీజేపీకి 2019లో ఎన్నికల్లో గెలిచిన సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు.
పీకే వ్యాఖ్యలతో జగన్ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం