ETV Bharat / state

మాజీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్‌ సభ్యులు! - ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలరా? - SIT Team in Andhra Pradesh - SIT TEAM IN ANDHRA PRADESH

Political Parties Allegations on SIT Team in Andhra Pradesh: ఎన్నికల హింసపై సిట్‌ దర్యాప్తు ఎలా ఉన్నా అందులోని సభ్యుల నిస్పాక్షిక విచారణపై సందేహాలు తలెత్తుతున్నాయి. సిట్‌లో 13 మంది సభ్యులుంటే అందులో 9 మంది ఏసీబీ విభాగం నుంచే ఉన్నారు. వేర్వేరు విభాగాల నుంచి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Political Parties Allegations on SIT Team
Political Parties Allegations on SIT Team (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 11:29 AM IST

మాజీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్‌ సభ్యులు! - 13 మందిలో 9 మంది ఏసీబీ నుంచే (ETV Bharat)

Political Parties Allegations on SIT Team : రాష్ట్రంలో పోలింగ్‌ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్‌లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిట్‌లోని 13 మందిలో 9 మంది ఏసీబీలోనే పని చేస్తున్నారు. వీరిలో ఎస్పీ స్థాయి అధికారి మొదలుకుని ఇన్‌స్పెక్టర్ల వరకూ ఉన్నారు. వీరందరినీ నియమించింది రాజేంద్రనాథరెడ్డే. ప్రస్తుతం వీరు సిట్‌లో సభ్యులైనా ఆ తర్వాత మళ్లీ ఏసీబీలో రాజేంద్రనాథరెడ్డి నేతృత్వంలోనే పని చేయాలి. అలాంటప్పుడు సిట్‌ సభ్యులు వాస్తవాలను వెలికితీసి, ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలరా అనే సందేహం ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది.

క్షేత్రస్థాయిలో విచారణను ప్రారంభించిన సిట్‌ - కీలక రాజకీయ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశం - SIT INVESTIGATE VIOLENCE IN AP

SIT Team in Andhra Pradesh : వైఎస్సార్సీపీతో అంటకాగుతూ ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగించేలా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపైనే పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఎన్నికల సంఘం రాజేంద్రనాథరెడ్డిని డీజీపీ పోస్టు నుంచి తప్పించింది. తర్వాత ఆయన ఏసీబీ డీజీ పోస్టులో కొనసాగుతున్నారు. అలాంటి ఆరోపణలున్న అధికారి కింద పనిచేస్తున్న బృందాన్నే సిట్‌లో ఎలా నియమిస్తారనే సంశయం వ్యక్తమవుతోంది.

హింసకు తెగబడి ఎన్నికల్లో పైచేయి సాధించాలనే కుట్రలో భాగంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ రావడానికి కొన్ని నెలల ముందే వైఎస్సార్సీపీ వీరభక్తులైన అధికారులను డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలుగా కీలక స్థానాల్లో వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి వారికి పోస్టింగులు ఇచ్చారు. వారిలో ఎక్కువమంది జిల్లా ఎస్పీలకు సహకరించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు పనిచేశారు. ఎస్పీకే అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టించారు.

SIT Investigate on Post Poll Violence in AP : రాజేంద్రనాథరెడ్డైతే అరాచక శక్తుల్ని బైండోవర్‌ చేయనివ్వకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులున్నాయి. వైసీపీకి కొమ్ముకాస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎస్పీ విన్నవించినా పట్టించుకోలేదనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. వీటన్నింటి ఫలితంగానే పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని హింసాకాండపై 'సిట్​' దర్యాప్తు - ఎఫ్ఐఆర్​లలో మార్పులు, చేర్పులకూ సిద్ధం! - SIT INVESTIGATE VIOLENCE

తాడిపత్రిలోనూ డీఎస్పీ గంగయ్యనూ రాజేంద్రనాథరెడ్డే నియమించారు. గంగయ్యతో పాటు మరికొందరు అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. తిరుపతి డీఎస్పీ సురేందర్‌ రెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి, తిరుపతి ఎస్‌బీ సీఐ రాజశేఖర్‌ వీరంతా వైసీపీ వీరవిధేయులైన అధికారులు. తిరుపతిలో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం జరగడానికి, హింస చెలరేగడానికి వీరితోపాటు మరికొంతమంది బాధ్యులు. ఈ ధికారులంతా రాజేంద్రనాథరెడ్డి హయాంలో నియమితులైనవారే.

మరోవైపు ఎన్నికల హింసపై రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. అతి తక్కువ వ్యవధిలో వాస్తవాల్ని ఎలా వెలికితీయగలరు? కేసుల దర్యాప్తును సమీక్షించడం, సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోతే సంబంధిత సెక్షన్లు వర్తింపజేయడం, కొత్తగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఆ వివరాల్ని నివేదికలో పొందుపరచడం వంటివి సిట్‌ ప్రధాన బాధ్యతలు. ఈ కొద్దిసమయంలో బాధితులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కష్టమే. హడావుడిగా నివేదిక సమర్పిస్తే అసలు దోషుల్ని గుర్తించటం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిట్‌ అధిపతిగా ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఉన్నారు. బృందంలోని మిగతా 13 మంది సభ్యులూ పోలీసు అధికారులే. ఇదే బృందంలో పర్యవేక్షణ కోసం ఒక విశ్రాంత న్యాయమూర్తిని, ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించి ఉంటే పూర్తిస్థాయి వాస్తవాలు వెలికితీసే అవకాశం ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో అల్లర్లపై సిట్​ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.