ETV Bharat / state

హాస్టల్‌లో చేర్పిస్తారనే భయంతో కిడ్నాప్ డ్రామా - విస్తుపోయిన పోలీసులు - GUNTUR GIRL KIDNAP CASE UPDATES

గుంటూరులో బాలిక అపహరణ కలకలం - కేసును చేధించిన పోలీసులు

Guntur Girl Kidnap Case
Guntur Girl Kidnap Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2024, 9:54 AM IST

Guntur Girl Kidnap Case Updates : ఓ బాలిక చేసిన తప్పుడు ప్రచారం ఇటు తల్లిదండ్రులను, అటు పోలీసులను పరుగులు పెట్టించింది. చివరకి అదంతా డ్రామా అని తెలియడంతో వారు ఒక్కసారిగా షాక్​ గురయ్యారు. మరి అసలేం జరిగిదంటే తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. విజయవాడ నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లోకి ఓ అమ్మాయి వచ్చింది. ఓ ప్రయాణికుడి వద్దకు వెళ్లి తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని, వారి చెర నుంచి తప్పించుకుని వచ్చానని తెలిపింది. ఫోన్‌ ఇస్తే తన తల్లితో మాట్లాడతానని అర్థించింది. వెంటనే కంగారుగా అతను ఆమె తల్లి నంబర్​ను తెలుసుకుని రింగ్‌ చేసి బాలికకు ఇచ్చాడు.

‘ఇంటి వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ అమ్మకు ప్రమాదం జరిగింది. వెంటనే బయల్దేరమని చెప్పి కారు ఎక్కించుకున్నారు. విజయవాడ తీసుకొచ్చి బస్టాండ్ వద్ద భోజనానికి కారు ఆపారు. వారు హోటల్‌కు వెళ్లారు. కారు లాక్‌ సరిగా వేయలేదని దీంతో తప్పించుకుని బస్టాండులోకి వచ్చినట్లు' బాలిక తల్లికి చెప్పింది. ఆమె కంగారుపడి విజయవాడలో ఉన్న సోదరికి విషయం చెప్పి బస్టాండ్​కి వెళ్లమని కోరింది.

ఇంతలో ఆ ప్రయాణికుడు ఆ బాలికను బస్టాండ్​లోని కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆర్టీసీ సిబ్బంది ఈ సమాచారాన్ని కృష్ణలంక పోలీసులకు చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సీసీ కెమెరాలు పరిశీలించడంతో గుట్టురట్టు : కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నట్లుగా ఆ అమ్మాయి చెప్పడంతో ఆ దిశగా కృష్ణలంక పోలీసులు విచారణ చేపట్టారు. బస్టాండ్ బయట భోజనం కోసం కారును కిడ్నాపర్లు ఆపిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీని నిశితంగా పరిశీలించిన పోలీసులు బాలిక చెప్పినట్లుగా ఆ ప్రాంతంలో కారు కానీ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కానీ లేవని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు విచారణ సమయంలో బాలిక పలు రకాలుగా పొంతన లేని సమాధానాలు చెప్పింది.

ఒక వేళ బాలికను కిడ్నాప్‌ చేసి ఉంటే కారులో ఆమెను వదిలి భోజనానికి ఎలా వెళ్తారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు వచ్చారు. వారిని అడిగి వివరాలు రాబట్టారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను అమ్మాయి, ఆమె తల్లిదండ్రులకు పోలీసులు చూపించారు. చివరకు బాలిక చెబుతున్నది కట్టుకథగా పోలీసులు తేల్చారు.

లిఫ్ట్‌ అడిగి కారులో విజయవాడకు : గుంటూరులోని వెంగళరావునగర్‌లో నివాసం ఉంటున్న బాలిక తండ్రి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య గృహిణి. వీరి కుమార్తె (12) ఓ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇరుగుపొరుగు పిల్లల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. దీనిపై సోమవారం ఉదయం కుమార్తెను తల్లి మందలించింది. ఇలాగైతే నిన్ను హాస్టల్‌లో చేర్పిస్తానని ఆమెకు చెప్పింది.

కాలు నొప్పి కారణంగా ఆ బాలిక పాఠశాలకు వెళ్లలేదు. ఇక్కడే ఉంటే తల్లి హాస్టల్‌లో చేర్పిస్తుందని భయపడిన చిన్నారి ఇంటి నుంచి బయటపడింది. విజయవాడలోని పిన్ని ఇంటికి వెళ్లాలని నిర్ణయానికి వచ్చింది. రోడ్డుపైకి వచ్చి విజయవాడ వెళ్తున్న కారును ఆపి లిఫ్ట్‌ అడిగింది. కారులో విజయవాడలోని వారధి కూడలి వద్ద దిగింది. అక్కడి నుంచి నడుచుకుంటూ పండిట్‌ నెహ్రూ బస్టాండ్​కి చేరుకుంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో కిడ్నాప్‌ డ్రామా ఆడింది. కృష్ణలంక పోలీసులు అమ్మాయిని పోలీస్​స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ తర్వాత కృష్ణలంక సీఐ నాగరాజు బాలికను తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. 12 సంవత్సరాల బాలిక ఆడిన కిడ్నాప్‌ డ్రామా పోలీసులు, ఆమె తల్లిదండ్రులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని కిడ్నాప్ - చాకచక్యంగా తప్పించుకున్న బాలిక

"ఎంతపని చేశావు స్వరూపా" - ఇంటికి వెళ్లి చాక్లెట్ ఇచ్చి నమ్మించావుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.