ETV Bharat / state

వైసీపీ బొట్టు బిళ్లలు పంపిణీ - రాచమల్లుపై కోడ్​ ఉల్లంఘన కేసు నమోదు - police File Case YCP MLA rachamallu

Police Register Case Against YCP MLA Rachamallu: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ నేతలు అనేక వ్యూహలు రచిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలను ముద్రించి మహిళలు నుదుటన పెట్టుకునే బొట్టు స్టిక్కర్లను కార్డుపై అతికించి ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారంలో మహిళలకు పంపిణీ చేశారు. దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఫిర్యాదు చేయడంతో రాచమల్లుతో పాటు మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Police Register Case Against YCP MLA Rachamallu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 10:58 AM IST

Police Register Case Against YCP MLA Rachamallu: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల వేళ మహిళల సెంటిమెంట్‌ను ఓట్ల రూపంలో మలుచుకోవడానికి దీర్ఘ సుమంగళీభవ పేరుతో బొట్టు బిళ్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. "ఫ్యాన్ గుర్తుకే మన ఓటు" అని కార్డుపై రాశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ అనేక మార్గాల ద్వారా ప్రలోభాలు పెడుతోంది.

Face Stickers Distribution Program in Election Campaign: వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలను ముద్రించి మహిళలు నుదుటన పెట్టుకునే బొట్టు స్టిక్కర్లను కార్డుపై అతికించారు. గోపవరం పంచాయతీ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి ఒక బొట్టు తీసి మహిళలకు నుదుటన పెట్టి కార్డులు అందించారు. దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి బొట్టు బిళ్లలు పంపిణీ చేశారని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం (Flying Squad Team) ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యే రాచమల్లుకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించం: అసమ్మతి నేతలు - Meeting Against MLA Rachamallu

గతంలో కూడా రాచమల్లు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు బహుమతులు పంపీణీ చేయడం జరిగింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని చెప్పిన మరుసటి రోజే అనుమతి లేకుండా ప్రచారానికి వెళ్లడంతో అధికారులు అడ్డుకున్నారు. ప్రొద్దుటూరులోని 38వ వార్డులో అనుమతి లేకుండా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో ఎన్నికల అధికారుల బృందం అక్కడికి చేరుకొని ప్రచారానికి అనుమతి లేదని నిలిపివేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయాలంటే సువిధ యాప్​లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

'మేం అనుమతి తీసుకోవాలా?!'- కోడ్​ ఉల్లంఘించి వైసీపీ నేతల ప్రచారం, ర్యాలీలు

అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం చేయాలని చెప్పడంతో ప్రచారాన్ని నిలిపివేసిన రాచమల్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల కోడ్‌ను పటిష్ఠగా అమలు చేయాలని ఓ వైపు ఎస్​ఈఓ మొర పెట్టుకుంటున్నా వైఎస్సార్సీపీ నేతలు మాత్రం తమ నిబంధనలు వేరే ఉంటాయిలే అన్నట్లు వ్వహరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిబంధనలను పాటించకపోగా ఓటర్లను యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొంటున్నారు.

ఆదినారాయ‌ణ‌రెడ్డికి టికెట్ ఇచ్చినా పోటీ సాధారణమే : ఎమ్మెల్యే రాచమల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.