800 KG Ganja Seized In Hyderabad : హైదరాబాద్‌లోని పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్‌పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్‌లో సుమారు 800 కిలోల గంజాయిని బాలానగర్ సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పెద్ద అంబర్‌పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్‌లో సుమారు 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు.
కంటైనర్ డ్రైవర్‌తో సహా ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ ఎస్‌వోటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వారిని కస్టడీకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది నిందితులు పట్టుబడే అవకాశముందని చెప్పారు. కంటైనర్‌లో గంజాయి తరలించిన ఘటన ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.2.80 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని అరకుకు చెందిన రాము అనే వ్యక్తిని సరఫరాలో కీలక నిందితుడిగా గుర్తించినట్లు వివరించారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయానికి భయపడుతున్న ముఠాలు- ఎన్ఫోర్స్మెంట్ విచారణలో కీలక విషయాలు
ఒడిశాలోని బలిమెలకు చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ట్రాన్స్‌పోర్ట్‌గా ఉంటున్నాడని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గంజాయి రవాణా చేసినందుకు సోమనాథ్ ప్రతి ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.3 లక్షలు తీసుకుంటాడని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన రిసీవర్ మారుతి పటేల్ పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. మహారాష్ట్రలో మారుతి గంజాయిని రిసీవ్ చేసుకున్న తర్వాత మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో వియోగదారులకు సరఫరా చేస్తున్నాడని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రాముతో పాటు సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు.
'అంబర్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్ నుంచి 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. ఇంత మెుత్తంలో గంజాయి పట్టుకోవడం ఇదే మొదటి సారి. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 2 కోట్ల 80లక్షల రూపాయలు ఉంటుంది. గంజాయి సరఫరాలో కీలక నిందితుడిగా ఏపీలోని అరకుకు చెందిన రాము అనే వ్యక్తిగా గుర్తించాం. ఇతను అరకుకు చెందిన వ్యక్తి. రాముకు సోమనాథ్ అనే వ్యక్తి కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ట్రాన్స్‌పోర్టర్‌గా వ్యవరిస్తున్నాడు. ఇద్దరు కలిసి ఇతర రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.'- శ్రీనివాస్, శంషాబాద్ ఎస్‌వోటీ డీసీపీ
కంటైనర్‌లో 800 కిలోల గంజాయి స్మగ్లింగ్ - గోల్కొండ వద్ద సీజ్ చేసిన అధికారులు