ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- అక్కడ 144 సెక్షన్​ అమలు - POLICE MOCK DRILL

Police Mock Drill in YSR District : రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మాక్​ డ్రిల్​ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చిరించారు.

police_mock_drill_in_ysr_district
police_mock_drill_in_ysr_district (ETVBharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 2:25 PM IST

Police Mock Drill in YSR District : పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో జూన్‌ 4న ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాక్‌ డ్రిల్‌ చేసి చూపించారు. అల్లర్లు చేసే వారిని ఎలా చెదరగొట్టాలి, లాఠీ ఛార్జ్‌లో గాయపడిన వారిని ఆసుపత్రికి ఎలా తరలించాలి అనేది కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. జూన్‌ 6వరకు ఊరేగింపులు, సంబరాలకు అనుమతి లేదని ఏఎస్పీ వెంకటరాముడు తెలిపారు. ఎవరైనా గొడవలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు (ETV Bharat)

Police Vote Counting Arrangements in Konaseema District : కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలలో పోలింగ్‌ రోజు హింసాత్మక ఘటనలు జరిగిన దృష్ట్యా కౌంటింగ్‌ రోజు ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది. కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే లెక్కింపు కేంద్రం వద్ద ముల్లకంచెలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు మూడంచెల భద్రతతో పర్యవేక్షణ కొనసాగుతుంది. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి హిమాన్షు శుక్లా ఎస్పీ శ్రీధర్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.

'కనిగిరిలో అల్లర్లు, పెట్రోల్​ బాంబు దాడులు- పోలీసుల​ లాఠీచార్జి, ఫైరింగ్' - police Mock Drill in kanigiri

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి డీఎస్పీ మోహన్ హెచ్చరించారు. నర్సీపట్నంలోని పలు కీలక ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించి పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలతో పాటు ఆటో, కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి బెట్టింగులకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ మోహన్ హెచ్చరించారు.

కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు - కొరడా ఝుళిపిస్తామంటూ హెచ్చరికలు - counting centers

ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలసి పారా మిలటరీ బలగాలతో కలసి మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేథ్యంలో అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టడం, రబ్బరు బులెట్లను ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్‌లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా, హింసకు ప్రేరేపించినా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ ఆధికారులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.