ETV Bharat / state

యాక్సిడెంట్​లు ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరుగుతున్నాయి? - రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల సూపర్​ ప్లాన్ - tg police check road accidents - TG POLICE CHECK ROAD ACCIDENTS

Telangana Police Road Safety Rules : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇందుకు ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటుంది. ఎక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే విషయాన్ని ముందుగా పోలీసులు గమనిస్తారు. అనంతరం వారి ప్లాన్​ను అమలు చేస్తారు. ఈ మేరకు పోలీస్​ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ROAD ACCIDENTS IN TELANGANA
ROAD ACCIDENTS IN TELANGANA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 1:17 PM IST

Measures to Prevent Road Accidents in Telangana : నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అయితే ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు వినూత్న చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, సమయాన్ని సాంకేతికంగా అధ్యయనం చేసి, ప్రత్యేక గస్తీ నిర్వహించాలని చూస్తున్నారు. ఈ విధంగా ప్రమాదాలు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

రాష్ట్రంలో సగటున రోజుకు 56 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 18 మంది మరణిస్తున్నారు. అయితే జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల విషయంలో దేశంలోనే తెలంగాణ 8వ స్థానంలో ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గతేడాది రాష్ట్రంలో 20,699 ప్రమాదాలు జరగ్గా, 6,788 మంది మరణించారు. ఇది ప్రతి సంవత్సరానికి పెరుగుకుంటూ వస్తుండడం ఆందోళన చెందాల్సిన అంశమే. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రమాదాలు, వాటి తాలూకూ మరణాలను తగ్గించలేకపోతున్నారు పోలీసులు.

రాష్ట్రంలో సుమారు 200 బ్లాక్​ స్పాట్​లు : రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకే కేవలం పోలీస్ శాఖలో ప్రత్యేకంగా రహదారి భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ రహదారి భద్రత విభాగం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు నిర్మాణ లోపం, మితిమీరిన వేగం. ఈ రెండింటినీ నివారిస్తే ప్రమాదాలు అవే తగ్గిపోతాయి. ముఖ్యంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్​ స్పాట్లుగా గుర్తించి మరమ్మతులు చేయాలి. ఈ బ్లాక్ ​స్పాట్లు ఒక్క హైదరాబాద్​-విజయవాడ రహదారిలోనే 17 ఉన్నట్లు గుర్తించారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు.

ఇలాంటి బ్లాక్​స్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా మొత్త మీద దాదాపు రెండు వందలకు పైనే ఉన్నాయి. అంటే మలుపులు, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం, రోడ్లు ఇరుక్కుగా ఉండటం వంటి కారణాలతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించాలంటే రహదారులను మెరుగుపరచడంతో ప్రమాదాలు తగ్గుతాయి. అయితే ఇదంతా నిరంతరంగా జరిగే ప్రక్రియ.

24 గంటలు గస్తీ అంటే కుదరదు : రహదారుల మరమ్మతులతో సంబంధం లేకుండా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో గస్తీ పెంచడంతోనూ ఫలితం ఉంటుంది. పోలీసులకు ఉన్న విధుల దృష్యా 24 గంటలపాటు గస్తీ అంటే సాధ్యం కాదు. అందుకే రాష్ట్రంలో ఎక్కడెక్కడ, ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసుకొని, వాటి వివరాలు తెప్పించి విశ్లేషిస్తున్నారు. ఆ సమయాల్లో ఆయాచోట్ల గస్తీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బాధ్యతను ఆయా పోలీస్​ స్టేషన్లకే ఇచ్చేశారు. గస్తీ ఉంటే ఆటోమెటిక్​గా వాహనాల వేగం తగ్గుతుంది, రాంగ్​ రూట్​లో రావడం, నిబంధనలు ఉల్లంఘన, అకస్మాత్తుగా మలుపు తిరగడం వంటివి నివారించవచ్చు.

హైదరాబాద్​ రోడ్లపై ప్రయాణం అంటేనే హడలిపోతున్న ప్రజలు - ఎందుకో తెలుసా? - Road Accidents In Hyderabad

17 బ్లాక్ స్పాట్స్‌లలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు - మంత్రి కోమటిరెడ్డి రివ్యూ - Minister Komatireddy on Road Safety

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.