ETV Bharat / state

సీఎం జగన్​పై గులకరాయి దాడి కేసు- సతీష్‌ను విచారించిన పోలీసులు - Police Interrogated Satish - POLICE INTERROGATED SATISH

Police Interrogated Satish accused in Case Stone Attack on CM Jagan : సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడు సతీష్‌ను పోలీసులు విచారించారు. గురువారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు విజయవాడ జిల్లా జైలు నుంచి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ పీఎస్ కు తరలించారు.

police_interrogated_satish_accused_in_case_stone_attack_on_cm_jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 10:42 AM IST

Police Interrogated Satish accused in Case Stone Attack on CM Jagan : సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడు సతీష్‌ను పోలీసులు విచారించారు. గురువారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు విజయవాడ జిల్లా జైలు నుంచి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ పీఎస్ కు తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు నిందితుడు సతీష్‌ను న్యాయవాది సలీం, తండ్రి సమక్షంలో పోలీసులు విచారించారు. దాడి వెనుక ఇంకా ఎవరున్నారనే అనే అంశంపై పోలీసులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. మరో రెండ్రోజుల పాటు పోలీసుల విచారణ కొనసాగనుంది.

గులకరాయి దాడి కేసులో కీలక విషయాలు వెల్లడించిన దుర్గారావు - durga rao in jagan case released

Stone Attack on CM Jagan : 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో సీఎం జగన్‌కు స్వల్పగాయమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌లోని గంగారం గుడి సెంటర్‌ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి జగన్​కు తగిలింది. అనంతరం పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్​కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్‌ ఎడమ కనురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వైద్యులు అయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. ‌అనంతరం బస్సుయాత్ర తిరిగి కొనసాగించారు.

జగన్​పై దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - Stone Attack on Jagan in AP

సీఎం జగన్​పై గులకరాయి దాడి కేసు- సతీష్‌ను విచారించిన పోలీసులు

Gulakarayi Case Updates : ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నింధితులు అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు, స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్​ ఆధ్వర్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని సీసీఎస్​ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

Jagan Stone Attack Case Latest : గులకరాయితో దాడి కేసులో ఏప్రిల్​ 20 వ తేదీ రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న వేముల దుర్గారావును విజయవాడ నార్త్‌ ఏసీపీ కార్యాలయంలో ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి మళ్లీ అవసరమైతే స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.

వారాహి యాత్రలో కలకలం- పవన్ కల్యాణ్​పై రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి - Attack On Pawan Kalyan Varahi Yatra

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.