ETV Bharat / state

రాజ్​ తరుణ్​పై కేసు నమోదు- తానే అబార్షన్​ చేయించాడన్న లావణ్య - POLICE FILE A CASE ACTOR RAJ TARUN - POLICE FILE A CASE ACTOR RAJ TARUN

Tollywood Actor Raj Tarun : ప్రేమించి మోసం చేశాడన్న కేసులో నటుడు రాజ్​తరుణ్​పై కేసు నమోదైంది. ఇటీవల ఓ యువతి ప్రేమించి మోసం చేశాడని రాజ్​ తరుణ్​ నార్సింగి పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

Police_File_Case_Against_Actor_Taj_Tarun
Police_File_Case_Against_Actor_Taj_Tarun (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 4:46 PM IST

Updated : Jul 10, 2024, 10:10 PM IST

Police File A Case Against Actor Raj Tarun : నటుడు రాజ్‌తరుణ్‌ లావణ్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వారివురు పరస్పర ఫిర్యాదులతో పోలీసుల ఎదుట హాజరవుతున్నారు. మాల్వీ వల్లే రాజ్​ తనను దూరం పెట్టాడని లావణ్య అంటుంటే, అసలు రాజ్​కు తనకు వృత్తిరీత్యా సంబంధమే తప్పా వ్యక్తిగతంగా సంబంధాలు లేవని మాల్వీ మల్హోత్రా పోలీసులకు తెలిపింది. కాగా లావణ్య మరోసారి రాజ్‌ తరుణ్​పై తీవ్రఆరోపణలు గుప్పించింది.

నటుడు రాజ్‌ తరుణ్‌తో కలిసి అన్విక పేరుతో విదేశాలకు వెళ్లానని ఆమె ఆరోపించింది. అయితే రాజ్‌తరుణ్ తనకు ఒకసారి అబార్షన్‌ కూడా చేయించినట్లుగా ఆరోపణలు చేసింది. మరోవైపు రాయదుర్గం ఠాణాలో మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది. కాగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆ కేసును ఫిలింనగర్ ఠాణాకు బదిలీ చేశారు.

రాజ్​ తరుణ్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు : మరోవైపు మాల్వీ సైతం ఫిలింనగర్ ఠాణాలో లావణ్యపై ఫిర్యాదు చేసింది. రాయదుర్గం నుంచి ఫిలింనగర్‌కు ట్రాన్​ఫర్​ అయిన కేసులో భాగంగా లావణ్య ఫిర్యాదు మేరకు మాల్వీని విచారణ కోసం పోలీసులు పిలిస్తే ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని, వచ్చిన తర్వాత పోలీసుల ఎదుట హాజరవుతానని ఆమె చెప్పినట్లుగా సమాచారం. కాగా, తన కుటుంబ సభ్యులను లావణ్య బెదిరింపులకు గురిచేస్తోందని మాల్వీ మల్హోత్రా ఆరోపణలు చేసింది. ఇవన్నీ కాకుండా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్​ స్టేషన్​లో రాజ్​ తరుణ్​పై సెక్షన్​ 420, 506, 493 కింద కేసు నమోదు చేశారు.

లావణ్య ఇప్పటికే తమకు కొన్ని ఫొటోలు చూపించిందని అవి ఆధారాలుగా ఎంతమేరకు పనిచేస్తాయో చూస్తామని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణలో విషయాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. ఆ తర్వాతే అన్ని విషయాలు చెప్పగలమని చెబుతున్నప్పటికీ, మాల్వీ మల్హోత్రా తమ జీవితంలోకి వచ్చాకే రాజ్‌తరుణ్‌ తనకు దూరమయ్యాడని లావణ్య తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అటు ఇటీవలే ఈ వ్యవహారంపై రాజ్​ తరుణ్ స్పందించాడు. లావణ్యకు తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. ఆమె డ్రగ్స్​ తీసుకునేదని అప్పటినుంచి ఆమెను దూరం పెట్టినట్లు తెలిపాడు.

రాజ్​తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది : నటి లావణ్య - Lavanya on Hero Raj Tarun

రాజ్​తరుణ్ లావణ్య వ్యవహారంలో నాకేంటి సంబంధం : నటి మాల్వీ మల్హోత్రా - Actress Malvi Malhotra Reacts

Last Updated : Jul 10, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.