ETV Bharat / state

ఇంటెలిజెన్స్ ట్రైనింగ్‌ అకాడమీలో జాగిలాల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ - అబ్బురపరిచిన విన్యాసాలు - Police Dogs Parade hyderabad

Police Dogs Pass Out Parade in Moinabad : ఏదైన నేర సంఘటనలు జరిగినప్పుడు కేసును ఛేదించడంలో పోలీసులతో పాటు జాగిలాలు కీలకపాత్ర పోషిస్తాయి. మేలు జాతి శునకాలకు మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వివిధ అంశాల్లో శిక్షణనిచ్చి పోలీసు శాఖలో విధుల కోసం సిద్ధం చేస్తున్నారు. 23వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా జాగిలాలు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.

Police Dogs
Police Dogs Passing Out Parade in Moinabad
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 2:09 PM IST

Police Dogs Passing Out Parade in Moinabad : నేరం జరిగిన తర్వాత నిందితులను గుర్తించడం నేర విచారణలో అత్యంత కీలకమైన అంశం. నిందితులను పట్టుకోవడం కోసం శునకాలను వాడటం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇందుకోసం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగం ఉంది. పోలీస్ భాషలో శునకాలను కెనన్ అంటారు. మేలు జాతి శునకాలను ఎంపిక చేసి సుమారు 8 నుంచి 10 నెలల పాటు వివిధ అంశాల్లో వాటికి శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌ శివార్లలోని మొయినాబాద్‌లో వీటి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 23 బ్యాచ్​ల జాగిలాలకు శిక్షణ ఇచ్చారు.

ఈసారి బ్యాచ్‌లో జర్మన్ షఫర్డ్, గోల్డెన్ రిట్రీవర్, లాబ్రాడర్, కాకర్ స్పానియల్ జాతికి చెందిన 21 తెలంగాణ జాగిలాలు, మరో రెండు అరుణాచల్ ప్రదేశ్ శునకాలకు 9 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. 9 నెలల శిక్షణ అనంతరం పాసింగ్ అవుట్‌ పరేడ్‌లో అవి ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంట్లో పెంచుకున్న శునకాల్లాగే పోలీసు శాఖలో జాగిలాలు కేసు పరిశోధనలో అత్యంత విశ్వాసంతో పని చేస్తాయని పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ రవి గుప్తా అన్నారు.

5వేల కిలోల బాంబులు గుర్తింపు.. వేల మంది సేఫ్.. CRPF శునకాలు భళా!

Police Dogs Training : సాధారణమైన వాటితో పోల్చితే పోలీసు జాగిలాల శిక్షణ ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 వరకు రన్నింగ్, జంపింగ్ వంటి వ్యాయామాలతో పాటు రోజూ అరగంట గ్రూమింగ్ చేస్తారు. ఆహారం ఇచ్చాక తిరిగి విశ్రాంతి ఇస్తారు. మళ్లీ సాయంత్రం 4 నుంచి 6 వరకు ట్రైనింగ్ ఇస్తారు. పోలీస్‌ శాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు, విచారకర సంఘటనలు జరిగినప్పుడు హ్యాండ్లర్‌ ఆదేశాల మేరకు ఈ జాగిలాలు సెల్యూట్‌ చేయడం, నిర్దేశించిన వాహనంలోకి లేదా ప్రదేశంలోకి వెళ్లి హ్యాండ్లర్‌ ఆదేశాలు పాటిస్తాయి.

రిటైర్మెంట్​కు నో అంటున్న​ 'సూపర్​ ఫిట్'​ శునకం!

బందోబస్తు, దొంగతనాలు, హత్య కేసుల్లో నేరస్థుల కదలికలను గుర్తించడం, బాంబ్‌లు, ఇతర మందు సామగ్రిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముందుగా తమకు అవసరమైన జాగిలాల సంఖ్య గురించి ఆయా యూనిట్లు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తాయి. అందుకు తగినట్లు నాణ్యమైన బ్రీడర్స్ నుంచి 3 నెలల వయసు కుక్క పిల్లలను కొని ట్రైనింగ్ ఇస్తారు. వాటిని చూసుకునేందుకు ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్‌ను కేటాయిస్తారు. ఈ విధంగా ట్రైనింగ్‌ ఇచ్చిన జాగిలాలు పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా వాటికి నేర్పించిన పలు అంశాలను స్వయంగా ప్రదర్శించి చూపించారు. మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో గతంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, బిహార్ జాగిలాలకు కూడా ఇక్కడే శిక్షణ ఇచ్చారు.

తప్పిపోయిన బాలుడి ఆచూకీ కనిపెట్టిన పోలీస్​ డాగ్ 'లియో'-రంగంలోకి దిగిన 90 నిమిషాల్లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.