Abids Police Rescue Kidnapped Girl : హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అబిడ్స్‌లోని కట్టెల మండికి చెందిన ఆరేళ్ల బాలిక కనిపించడం లేదంటూ బాలిక తల్లి అబిడ్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 6 టీమ్‌లుగా విడిపోయి రాత్రంతా గాలించారు. దాదాపుగా వందల సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి బాలిక ఆచూకీ కనుగొన్నారు.
పాప తన ఇంటి వద్దనున్న ఓ గుడి వద్ద ఆడుకుంటానని చెప్పి, 2 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. తర్వాత వాళ్ల బంధువు వృతిక్తో ఆడుకుంది. ఆ తర్వాత బాలుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. కానీ బాలిక మాత్రం ఇల్లు చేరలేదు. దీంతో బాధితురాలి తల్లి ఎంతగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఠాణాలో ఫిర్యాదు చేసింది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి పట్టివేత : బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, పాపను కనుగొనేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే నిందితుడు బిహార్‌కు చెందిన బిలాల్ అన్సారీ బాలికను ఆటోలో అఫ్జల్‌గంజ్ వరకు తీసుకెళ్లినట్లు, అక్కడి నుంచి ఆర్టీసీ బస్‌లో జేపీ దర్గాకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. గత మార్చిలో హైదరాబాద్ వచ్చిన నిందితుడు, కొత్తూర్ మండలంలోని ఓ కంపెనీ బేస్ క్యాంప్‌లో కూలీగా పని చేస్తున్నాడు. పాపను తీసుకుని వెళ్లిన నిందితుడిని సీసీటీవీల ఆధారంగా ఈరోజు ఉదయం ఇన్మూల్నర్వాల్ బస్టాండ్ దారిలో పట్టుకున్నట్లు డీసీపీ ఆక్షాన్ష్ యాదవ్ వెల్లడించారు.
ప్రస్తుతం బాలికను సైఫాబాద్‌లోని భరోసా కేంద్రానికి పంపి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. బిహార్‌లోని భగల్పురా జిల్లాకు చెందిన నిందితుడు, బాలికను డబ్బు కోసం మాత్రమే కిడ్నాప్ చేసినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడు బిహార్ వెళ్లేందుకు డబ్బు లేకపోవడంతో బాలికను కిడ్నాప్ చేసి ఆమె తండ్రిని డబ్బు డిమాండ్ చేయాలనేది నిందితుడి ప్లాన్‌గా వివరించారు. అయితే గత రాత్రి పాపను తనతో పాటే ఉంచుకున్న నిందితుడు, ఉదయం బాలిక తండ్రిని బెదిరించేందుకు బయటకు వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
Girl Kidnap Case Hyderabad : నిందితుడు బిలాల్ అన్సారీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బిహార్‌లో ద్విచక్రవాహన దొంగతనం చేశాడని, అందుకు 9 నెలల జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. అలాగే 11 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేయడంతో మరో 2 సంవత్సరాల 2 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. కాగా సైబరాబాద్ ఠాణా పరిధిలో కూడా ఎనిమిదేళ్ల మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసి పరారీలో ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఇలా మరో సెల్‌ఫోన్‌తో పాటు రూ.800 దొంగతనానికి సంబంధించి కూడా బిహార్‌లో ఫిర్యాదు అందిందని, గత నేర చరిత్రను పోలీసులు బహిర్గతం చేశారు.
ఈ మొత్తం విషయంలో బాలికకు నిందితుడు సైకిల్ ఆశజూపి తన వెంట తీసుకెళ్లాడు. కాగా ఈరోజు ఉదయం నిందితుడిని ఠాణాకు తీసుకురాగానే ఉద్రేకానికి గురైన కట్టెలమండి కాలనీవాసులు, నిందితుడికి ఠాణాలోనే దేహశుద్ధి చేశారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ఎవరు ఎలాంటి వస్తువులు ఇచ్చినా తీసుకోకుండా పిల్లలకు సూచించాలని తెలిపారు.
అబిడ్స్‌లో బాలిక కిడ్నాప్ - 24 గంటల్లో రెస్క్యూ చేసిన పోలీసులు - ABIDS POLICE RESCUED KIDNAPPED GIRL