ETV Bharat / state

సామాన్యుడిపై కానిస్టేబుల్​ అమానుష దాడి - పీఎస్​లో చెప్పినా న్యాయం జరగలేదని బాధితుడి ఆవేదన - Constable Beat a Common man

Police Beats a Common Man in Hyderabad : సామాన్యులకు రక్షణ కల్పించే పోలీసే, ఓ సామాన్యుడిని రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో ఆ బాధితుడు పోలీస్​ స్టేషన్​కు వెళ్లినా న్యాయం జరగలేదు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

Police Beats a Common Man in Hyderabad
సామాన్యుడిపై కానిస్టేబుల్​ అమానుష దాడి - న్యాయం జరగలేదంటూ బాధితుడు ఆవేదన
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 10:24 PM IST

Police Beats a Common Man in Hyderabad : సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసే కోపంతో ఓ సాధారణ వ్యక్తిపై అమానవీయంగా దాడి చేశారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పీఎస్​ పరిధిలో జరిగింది. జీడిమెట్ల పీఎస్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ ఓ కటింగ్ షాప్ నిర్వాహకుడిపై చేయి చేసుకొని కన్నుపై రక్తం వచ్చేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు.

స్థానికులు, బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డుపై జీహెచ్​ఎంసీ(GHMC)సిబ్బంది డ్రైనేజీ పనులు చేస్తున్నారని, మట్టి పక్కన నుంచి వెళ్లండి అని కటింగ్​ షాప్​ నిర్వాహకుడు సివిల్​ డ్రెస్​లో ఉన్న కానిస్టేబుల్​ శ్రీనివాస్ గౌడ్​కు సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్​ శ్రీనివాస్​గౌడ్​, తనకు చెప్పేదేంటంటూ కటింగ్​ షాప్​ నిర్వాహకుడుపై చేయి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు పరస్పరం వాగ్వాదానికి దిగారు.

ఈ గొడవలో కానిస్టేబుల్​ ​కటింగ్​ షాప్​ నిర్వాహకుడిని రక్తం వచ్చేలా కొట్టారు. తాను కానిస్టేబుల్​నని ఏమీ చేసుకుంటావో చేసుకో అంటూ దౌర్జన్యం చేశారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా సీఐ జరిగిన ఘర్షణ విషయాన్ని మర్చిపోవాలని సర్దుకుపోవాలని చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగినిపై మనసు పారేసుకున్న కంపెనీ సీఈవో - అమెరికా నుంచి ఇండియాకు వచ్చి మరీ వేధింపులు

ఖాకీల అత్యుత్సాహం - వరుస సంఘటనలతో పోలీసు శాఖకు అప్రతిష్ఠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.