ETV Bharat / state

కనిపిస్తే కబ్జా - ఎదురు తిరిగితే కిడ్నాప్​ - వెలుగులోకి ల్యాండ్ మాఫియా ఆగడాలు - Fakhruddin land mafia illegalities - FAKHRUDDIN LAND MAFIA ILLEGALITIES

Fakhruddin Land Mafia Illegalities : హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తారు. ఎవరైనా అడ్డు వస్తే కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేస్తారు. వారి కన్ను పడిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎంత దుర్మార్గానికైనా తెగిస్తారు. ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్న అక్రమార్కుల ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు.

MRPS Leader Kidnap Case Update
MRPS Leader Kidnap Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 1:52 PM IST

MRPS Leader Kidnap Case Update : హైదరాబాద్ చాంద్రయణగుట్టకు చెందిన సుజాయత్‌ అలీ, నార్సింగి బృందావన్‌కాలనీకి చెందిన ఫక్రుద్దీన్‌ భూమాఫియా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు న్యాయవాదులుగా చెలామణి అవుతూ భూ కబ్జాలు చేస్తున్నారు. వివాదాస్పద, విదేశాల్లో ఉండే ప్రవాసుల స్థలాలను గుర్తించి ఆక్రమించి గంటల వ్యవధిలో ప్రహరీ నిర్మిస్తారు. వాటికి సంబంధించిన నకిలీ దస్త్రాలు సృష్టిస్తారు. తాజాగా ఎమ్​ఆర్పీఎస్​ నేత అపహరణ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎదురుతిరిగితే కిడ్నాప్​ : అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌ను అడ్డాగా చేసుకుని బాధితులను చిత్రహింసలు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఫాంహౌస్‌లో పదుల సంఖ్యలో కుక్కలను కాపలాగా ఉంచుతారు. యజమానులు భూమి గురించి ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతారు. లేకపోతే మాట్లాడకుందామంటూ కిడ్నాప్‌ చేసి శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధి ధర్మవరంలో అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్‌కు తరలిస్తారు.

కుక్కల మధ్య బంధించి చిత్రహింసలు : కుక్కల మధ్యలో బంధించి చిత్రహింసలు పెడతారు. సుజాయత్‌ అలీ, ఫక్రుద్దీన్‌ అనుచరులపై నార్సింగిలో ఐదు, శంషాబాద్‌ ఠాణాలో ఒక కేసు ఉన్నాయి. ఇవన్నీ భూకబ్జాలు దాడులు, కిడ్నాప్‌నకు సంబంధించినవే నిందితులు కోర్టుల్ని తప్పుదోవ పట్టించేలా డాక్యుమెంట్లు తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుజాయత్‌ అలీ, ఫక్రుద్దీన్‌ గ్యాంగ్‌ నార్సింగిలో ఒక భూ వివాదంలో ఎమ్​ఆర్పీఎస్ నేత నరేందర్, ప్రవీణ్‌ను అపహరించి చిత్రహింసలు పెట్టి వదిలేశారు.

బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి : బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా నిందితుల అరాచకాలు, భూకబ్జాలు బయటకొచ్చాయని రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. ఇద్దరిని శంషాబాద్, ధర్మగిరి ఫాంహౌజ్‌లో మూడు రోజుల పాటు బంధించి నరకం చూపించారని డీసీపీ వెల్లడించారు. శంషాబాద్ శివారు ప్రాంతాల్లో ఫాంహౌస్‌లో తనిఖీలు నిర్వహించగా వీరి దారుణాలు బయటపడ్డాయి. నిందితుల దగ్గర డమ్మీ తుపాకులు, ఎయిర్‌ గన్‌లు, కత్తులు ఉన్నాయి.

అక్రమంగా నిర్మించిన ఫామ్​ఔస్​ కూల్చివేత : నార్సింగి కేసులో సుజాయత్‌ అలీ జైలుకెళ్లగా ఫక్రుద్దీన్‌ పరారీలో ఉన్నాడు. ఇప్పటివరకూ వీరి గ్యాంగ్‌ సభ్యులు 16 మంది పోలీసులకు చిక్కారని పోలీసులు తెలిపారు. పోలీసులు భూ ఆక్రమణ, కిడ్నాప్‌ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ధర్మగిరి సమీపంలో నిర్మించిన ఫాంహౌస్‌ అక్రమమని తేలింది. ఈ క్రమంలో అధికారులు ఫాంహౌస్‌ను పొక్లెయిన్లతో నేలమట్టం చేశారు. భూ ఆక్రమణ ముఠా అక్రమంగా నిర్మించిన ఫామ్​ ఔస్​ను కూల్చివేసిన అధికారులు.

కిడ్నాప్‌ చేసి, కుక్కలతో బెదిరించి - ఎమ్మార్పీఎస్ నేత కిడ్నాప్​ కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకి - MRPS Leader Kidnap Case Update

ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేందర్ కిడ్నాప్‌ - చిత్రహింసలు పెట్టి వదిలిపెట్టిన కిడ్నాపర్లు - MRPS Narendra Kidnap Case Update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.