ETV Bharat / state

పవన్‌ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్‌ - పోలీసుల అదుపులో మల్లికార్జునరావు - PAWAN KALYAN THREAT CASE

పవన్ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్ కేసులో దర్యాప్తు వేగవంతం - పోలీసుల అదుపులో నిందితుడు నూక మల్లికార్జునరావును

pawan_kalyan_threat_case
pawan_kalyan_threat_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2024, 4:02 PM IST

Police Arrest Suspect in Pawan Kalyan Threatening Call Case: పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్‌ కాల్స్‌ చేయడంతో పాటు సందేశాలు పంపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బెదిరింపు కాల్స్, సందేశాల గురించి సిబ్బంది పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

బెదిరింపు కాల్స్‌ చేసిన నూక మల్లికార్జునరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఫోన్ కాల్స్‌ చేసినట్టు పోలీసులు తేల్చారు. రహస్యప్రాంతంలో మల్లికార్జునరావుని పోలీసులు విచారిస్తున్నారు.

4 బృందాలుదా ఏర్పడి గాలింపు చర్యలు: పవన్‌ కల్యాణ్‌ పేషీకి 9505505556 నంబరు నుంచి కాల్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఈ నంబరు ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద టవర్‌ నుంచి కాల్స్‌ వచ్చినట్లు తేలింది. విజయవాడ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ బ్రాంచి, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాలకు చెందిన పోలీసులతో 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఆఘమేఘాలపై గాలింపు చేపట్టగా ఫోన్‌ స్విచాఫ్‌ చేయడంతో అతను ఎక్కడ ఉన్నాడు అనేది గుర్తించడం కష్టంగా మారింది. దీంతో విజయవాడతో పాటు తిరువూరులోనూ గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నారు.

నా భద్రత గురించి భయంగా ఉంది - మంచు మనోజ్‌పై పోలీసులకు మోహన్‌బాబు ఫిర్యాదు

ఓ యూట్యూబ్‌ ఛానల్‌ బాధ్యతా రాహిత్యం వల్లే ఈ పరిస్థితి : బోరుగడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.