Police Arrest Mosh Pub Gang in Nagpur : ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న చెందిన ఏడుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మోష్ పబ్ ఘటనలో ఈ ముఠా గురించి బయటపడింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఆకాశ్‌కుమార్, సూరజ్‌కుమార్, అషత్ నరుల, తరుణ్, శివరాజ్, సాయి కుమార్, రోహిత్‌కుమార్‌లు కలిసి డేటింగ్ యాప్‌లో యువతులతో వలపు వల విసిరి వ్యాపారుల నుంచి డబ్బులు దండుకునే దందాకు తెర తీసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడిందని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. కొన్ని నష్టాల్లో ఉన్న పబ్బులను ఎంపిక చేసుకుని నిందితులు వ్యాపారులను మోసం చేస్తున్నట్టు డీసీపీ వివరించారు.
Hyderabad Pub Scam : ఫేక్ ఐడీలతో డేటింగ్ యాప్‌ల ద్వారా చాటింగ్ చేసేవారని, యువతుల పేరుతో పురుషులే చాటింగ్ చేసి వ్యాపారులను ఆకర్షించే వారని ఆయన చెప్పారు. యువతుల పేరిట ముగ్గులోకి దించి పబ్బులో కలుద్దామని మద్యం సేవిద్దామని చెబుతారని, పథకం ప్రకారం యువతులు తక్కువ మద్యం సేవించి, బిల్లు కట్టే సమయానికి యువతి చాకచక్యంగా బయట పడుతుందని తెలిపారు.
"మాష్ పబ్‌లో జరిగిన ఘటన గురించి మాకు సమాచారం అందింది. ఆన్లైన్లో ఉన్న డేటింగ్స్ యాప్‌లలో ఫేక్ ఐడీలతో చాటింగ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షించటం. అనంతరం మాష్ పబ్‌ల్లో కలుద్దామంటూ పిలిచి, అత్యధిక ధర ఉన్న బెవరేజెస్ ఆర్డర్స్ చేసి బిల్లు అధిక మొత్తంలో చేసి అమ్మాయి పరారవటం జరుగుతుంది. ఈ ఉదాంతం వెనుక ఎవరున్నారనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అలానే ముఠా 40 రోజుల్లో నలభై లక్షల వరకు దండుకున్నట్టు గుర్తించాం. బాధితులు ఎవరైన ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి."-వినీత్,మాదాపూర్ డీసీపీ
నిరుద్యోగ యువతులను ముఠా ట్రాప్ చేస్తోంది : ఈ లోపు పబ్బు నిర్వాహకులు బిల్లు రూ.30వేలు నుంచి రూ.40 వేలు అయిందని యువతితో పాటు వచ్చిన వ్యక్తుల చేతిలో పెడతారు. బిల్లు ఎందుకు అంత మొత్తంలో అయింది అని తెలుసుకునే సమయం కూడా ఇవ్వకుండా పబ్బు నిర్వాహకులు సదరు వ్యక్తి ముక్కు పిండి మరీ బిల్లు వసూలు చేస్తున్నట్టు డీసీపీ వినీత్ చెప్పారు. అయితే సదరు ముఠా సభ్యులతో పబ్బు నిర్వాహకులు పథకం ప్రకారం కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు వివరించారు.
గతంలో డెవిల్స్ క్లబ్ పేరుతో ఈ ముఠా దిల్లీ, బెంగళూరు నగరాల్లో డేటింగ్ యాప్ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఉద్యోగ వేటలో ఉన్న యువతులను గుర్తించి వారితో కలిసి మోసాలకు ముఠా పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. మోష్ పబ్బు యజమానితో పాటు మరో ఇద్దరు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన రెండు కార్లు, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ డేటింగ్ స్కాం- కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు - hyderabad dating scam
Tips For Dating to Marriage: డేటింగ్ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మరిచిపోవద్దు!