ETV Bharat / state

సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటున్నారా? - ఆ పోస్టులు పెడితే చిప్పకూడే!

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రభుత్వం సీరియస్ - అలాంటి పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

Government Serious on Obscene Posts
Government Serious on Obscene Posts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Government Serious on Obscene Posts : సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్న వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాక్‌ స్వాతంత్య్రం పేరుతో ఇష్టారీతిన తీవ్ర వ్యాఖ్యలను పోస్టు చేస్తున్న వారిపై కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటికి 47 కేసులు పెట్టారు. అలాగే ఐటీ, బీఎన్‌ఎస్‌ చట్టాల్లోని కఠినమైన సెక్షన్లను జోడిస్తున్నారు. దీంతో అరాచకవాదుల ఆట కట్టించే వీలుందని పోలీసులు భావిస్తున్నారు.

స్టేషన్లకు పిలిపించి విచారణ : కమిషనరేట్‌ పరిధిలోని 23 పోలీసుస్టేషన్లలో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే వారికి నోటీసులిచ్చి స్టేషన్లకు పిలిపించి విచారిస్తున్నారు. సరిగా సమాధానాలు ఇవ్వని వారిని మళ్లీ పిలిపిస్తున్నారు. కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఈ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో మకాం వేసిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో మరో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కంటతడి పెట్టారు : పవన్ కల్యాణ్

గ్రూప్‌ అడ్మిన్‌, సభ్యులను గుర్తించి నోటీసులు : స్థానిక వాట్సాప్‌ గ్రూప్‌లపైనా పోలీసులు నిఘా తీవ్రం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులను పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక వాట్సాప్‌ గ్రూప్‌ల్లో వైరల్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ గ్రూప్‌లపై నిఘా పెట్టి వాటి అడ్మిన్‌లు, సభ్యులను గుర్తించి, 500 మందికి పోలీసులు నోటీసులిచ్చారు. నందిగామ, జగ్గయ్యపేటల్లో పలువురికి నోటీసులు ఇవ్వగా ఆ గ్రూప్‌ల్లోని సభ్యులు వాటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు.

ఎక్స్ హ్యాండిల్స్‌ పైనా పోలీసుల నిఘా : ఎక్స్‌లో వైఎస్సార్సీపీ అనుకూల హ్యాండిల్స్‌ పైనా పోలీసులు దృష్టి పెట్టారు. అరాచక వైఎస్సార్సీపీ సానుభూతిపరులు పెట్టే పోస్టులను ఫాలో అవుతున్న వారు, లైక్‌లు కొడుతున్న వారిని గుర్తిస్తున్నారు. వీరికీ నోటీసులు పంపుతున్నారు. విదేశాల్లో ఉండి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్​లను తీవ్రంగా దూషిస్తున్న పంచ్‌ ప్రభాకర్‌పై విజయవాడ సైబర్‌ స్టేషన్‌లో ఇప్పటికే కేసు పెట్టారు. ఇతని హ్యాండిల్‌ను ఫాలో అవుతున్న వారిని కూడా గుర్తించి త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు.

వర్రా ఎస్కేప్ - పోలీసులపై ప్రభుత్వం సీరియస్‌ - ఇంటెలిజెన్స్​కు ఆదేశాలు

"అతి మంచితనం చేతకానితనం కాకూడదు - అధికారుల హ్యాంగోవర్ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.