ETV Bharat / state

కాపాడాల్సిన వాడే కాటేయబోయాడు - మైనర్​ బాలికపై సీఐ అత్యాచారయత్నం - POCSO CASE FILED ON CI

మైనర్​ బాలికతో అసభ్య ప్రవర్తన, అత్యాచారయత్నం - సీఐపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

EtvCase filed Against CI for Sexual assault With Girl
Case filed Against CI for Sexual assault With Girl (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 8:20 AM IST

Case filed Against CI for Sexual Assault On Minor Girl : ఒంటరిగా ఉన్న మైనర్ బాలికతో ఓ పోలీస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.​ జిల్లాలోని ఓ అపార్ట్ మెంట్​లో నివసిస్తున్న పోలీస్ ఇన్​స్పెక్టర్ రవికుమార్ అదే ప్రాంతంలో ఉంటున్న ఓ బాలికపై కన్నేసి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.

ఇది గమనించిన బాలిక తప్పించుకుని తల్లికి విషయం చెప్పగా ఆమె ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కాగా ఓ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న పోలీసు అధికారే బాలికపై అసభ్యంగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది. ప్రజలను రక్షించాల్సిన సీఐ ఇలా చేయడం చర్చకు దారితీసింది.

విధి నిర్వహణలో అలసత్వం : గతంలో హనుమకొండ, మామ్ నూర్, మడికొండ ఠాణాల్లో ఇన్​స్పెక్టర్​గా పనిచేసిన రవికుమార్​ను ఉన్నతాధికారులు రెండు వారాల క్రితం మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. మడికొండలో విధుల నిర్వహణలో అలసత్వంపై రవికుమార్​పై వేటు వేసి హెడ్​ క్వార్టర్​కు అటాచ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.