ETV Bharat / state

నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి, ప్రధాని రాక - హైదరాబాద్​లో భారీ బందోబస్తు - PM Modi Visits Telangana Today

PM Modi telangana Tour Today : ప్రధాని నరేంద్ర మోదీ శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల మలివిడత ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ ఇవాళ మాల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో రోడ్‌షోలో పాల్గొంటారు. బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచేలా ప్రధాని పర్యటన సాగనుందని కమలం నాయకులు వెల్లడించారు.

PM Modi telangana Tour
PM Modi telangana Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 7:36 AM IST

తెలంగాణలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన-షెడ్యూల్ ఇదే

PM Modi Telangana Tour Today : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సాయంత్రం 4:50 నిమిషాలకి ప్రధాని చేరుకోనున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా మల్కాజ్ గిరికి వెళ్లనున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు రోడ్‌షో సాగనుంది. సాయంత్రం 6.40 నిమిషాల వరకు రాజ్‌భవన్‌ చేరుకుంటారు.

PM Modi Visits Nagarkurnool : శనివారం నాగర్‌కర్నూల్‌లో బీజేపీ(BJP) బహిరంగసభకు హాజరవుతారు. ఈ సభ నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ లోక్‌సభ స్థానాలు లక్ష్యంగా జరగనుంది. తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు ప్రధాని మోదీ వివరించనున్నారు. దేశంలో మూడోసారి బీజేపీ సర్కార్‌(BJP Government) రావాల్సిన ఆవశ్యకతను వివరించి మరోసారి ఆశీర్వదించమని ప్రజలను కోరనున్నారు. అలాగే ఈనెల 18న మోదీ జగిత్యాల బహిరంగసభలో పాల్గొంటారు.

బీఆర్​ఎస్​కు షాక్​ - బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్​, నగేశ్

Modi Election Campaign in Telangana 2024 : అయితే ఇప్పటికే ప్రధాని పలుమార్లు తెలంగాణకు వచ్చి వెళ్లారు. తాజాగా మరికొంతమంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ(Lok Sabha) స్థానాలే లక్ష్యంగా దానికి రూపకల్పన చేశారు. ఇప్పటికే ప్రధాని 4,5 తేదీల్లో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల తొలవిడత ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్‌, పటాన్‌చెరు విజయసంకల్ప సభల్లో పాల్గొన్నారు. అలాగే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఒకరోజు హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

President Murmu Visits Hyderabad Today : హైదరాబాద్‌ శివారు కన్హా శాంతివనంలో నిర్వహించే ‘ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము శుక్రవారం నగరానికి రానున్నారు. రాజధానిలో ఒకేరోజు రాష్ట్రపతి, ప్రధాని, సీఎం(Chief Minister) కార్యక్రమాలు నగరంలో జరగనున్న నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పోలీసులు విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్‌ మాసంలో సున్నిత పరిస్థితుల దృష్ట్యా అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరో సమరానికి మానుకోట సిద్ధం- బీజేపీ గూటిలోకి చేరేందుకు సిద్ధమైన సీతారాం నాయక్

తెలంగాణలో ఎన్నికల ప్రచార స్పీడు పెంచిన బీజేపీ - అమిత్​ షా రాకతో కొత్త జోష్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.