ETV Bharat / state

పవన్​ కల్యాణ్​ను చంపేస్తామని వార్నింగ్ - పేషీకి వచ్చిన ఫోన్ కాల్స్ - DEPUTY CM PAWAN KALYAN

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేషీకి బెదిరింపు ఫోన్‌ కాల్స్ - అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపిన ఆగంతుకుడు

THREATENING PHONE CALLS
AP DEPUTY CM PAWAN KALYAN (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 7:01 PM IST

Updated : Dec 9, 2024, 7:28 PM IST

Threatening Phone calls To Pawan kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్​ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్​ రావడం కలకలం సృష్టించింది. మంత్రి​ పేషీకి ఓ ఆగంతుకుడి నుంచి ఈ బెదిరింపు ఫోన్‌ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యంతరకర భాషతో ఆగంతుకుడు హెచ్చరిస్తూ సందేశాలు పంపాడు. వెంటనే అప్రమత్తమైన పేషీ అధికారులు బెదిరింపు కాల్స్, సందేశాలను పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపు కాల్స్​ విషయాన్ని పవన్‌ కల్యాణ్​ పేషీ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

డీజీపీకి హోంమంత్రి అనిత ఫోన్​ : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చిన విషయంపై వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత డీజీపీ ద్వారక తిరుమలరావుతో ఫోన్​లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఆగంతుకుడి నుంచి పవన్‌ పేషీకి రెండుసార్లు కాల్స్ వచ్చాయని డీజీపీ ఆమెకు తెలిపారు. ఆగంతుకుడిని వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

స్మగ్లింగ్​కు హబ్​గా కాకినాడ పోర్టు - రేషన్​ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం : పవన్​ కల్యాణ్

'ఆ పోస్టులకు తట్టుకోలేకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది'- పవన్ కల్యాణ్​ క్లారిటీ !

Last Updated : Dec 9, 2024, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.