Heavy Traffic Jam at Chilkur Balaji Temple : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాజేంద్రనగర్‌లోని కాళీమాత మందిరం నుంచి చిలుకూరు దేవాలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేరి వారికి గరుడ ప్రసాదం ఇస్తారని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వేకువజామున 5 గంటల నుంచే భక్తులు హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి బయల్దేరారు. కార్లు, ఇతర వాహనాల్లో భారీగా ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇప్పటివరకు 60,000ల మందికి పైగా దేవస్థానానికి వచ్చారని మొయినాబాద్ సీఐ తెలిపారు. ఆలయంం వద్ద ప్రస్తుతం గరుడ ప్రసాదం ఇవ్వడం లేదని, ఉదయం కాసేపు ఇచ్చాక ఆపేశారని అన్నారు. ఆలయ అధికారులు చెప్పినట్లు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 5,000ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలపగా కానీ ఒకేసారి వేల మంది రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని వివరించారు. ప్రజలు ఎవ్వరూ ఇటువైపు రావద్దని కోరుతున్నట్లు చెప్పారు. అదనపు సిబ్బందిని రప్పించి ట్రాఫిక్‌ను కనుబద్ధీకరిస్తున్నామని మొయినాబాద్ సీఐ వెల్లడించారు.
ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - VONTIMITTA BRAHMOTSAVAM