ETV Bharat / state

వైఎస్సార్సీపీ పాలనలో వంతెనలకూ ఒట్టిచెయ్యే - ఇక కూటమి ప్రభుత్వపైనే ఆశలు - Bridge Problems in Anakapalli - BRIDGE PROBLEMS IN ANAKAPALLI

Bridge Problems in Anakapalli District : ఐదేళ్ల కాలంలో వైఎస్సార్సీపీ పాలకులు వంతెనలకు పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. అనకాపల్లి జిల్లాలో బ్రిడ్జీలు కూలి వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నా జగన్‌ సర్కార్ పట్టించుకోలేదు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో వంతెనలనూ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Bridge Problems in Anakapalli District
Bridge Problems in Anakapalli District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 9:20 AM IST

ఐదేళ్ల పాలనలో వంతెనలను పట్టించుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం (ETV Bharat)

Anakapalli People Suffered due to Damaged Bridges : గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక వంతెనలు శిథిలమై ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. వాటికి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో అవి పూర్తిగా శిథిలమయ్యాయి. కానీ వాటి స్థానంలో కొత్తవి నిర్మించడంపైనా వైఎస్సార్సీపీ సర్కార్ దృష్టి పెట్టలేదు. దీంతో వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెనలపైనే ఇంకా రాకపోకలు సాగుతున్నాయి. ఏ క్షణంలో ఏ వంతెన కూలుతుందో అన్నట్టు పరిస్థితి తయారైంది.

Narsipatnam-Bheemili Road Damage : అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం - భీమిలి ప్రధాన రాష్ట్ర రహదారిపై ఉన్న రెండు ప్రధాన వంతెనలు కూలిపోయాయి. సాధారణంగా బ్రిడ్జి శిథిలమవుతున్న దశలోనే మరమ్మతులు చేయించడం, లేదా కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. వంతెన పూర్తిగా కూలిపోయిన తర్వాత ఆ శిథిలాలపై కాజ్‌వే నిర్మించి జగన్‌ సర్కార్ చేతులు దులుపుకుంది.

YSRCP Govt Neglet on Bridges : భీమునిపట్నం - నర్సీపట్నం బీఎన్​ రోడ్‌లో విజయరామరాజుపేట వద్ద కూలిపోయిన వంతెన స్థానంలో నిర్మించిన తాత్కాలిక కాజ్‌వేలను నిర్మించింది. వీటిపై నిత్యం ప్రయాణం నరకప్రాయంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. వడ్డాది వద్ద శిథిలమైన వంతెన స్థానంలో నాటి ప్రభుత్వం సిమెంట్ పైపులతో కాజ్‌వేను ఏర్పాటు చేసి మమ అనిపించింది. దీనికోసమే కోటిన్నరకుపైగా ఖర్చు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. కూలిన భాగం వరకు రాళ్లు వేసి వదిలేశారు.

"వంతెన కూలిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గత ప్రభుత్వం మా బాధలు పట్టించుకోలేదు. ఎక్కడా చూసినా ఇదే పరిస్థితి ఉంది. ఈ రోడ్డువైపు రావాలంటేనే భయం వేస్తోంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి వంతెనల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం." -వాహనదారులు

వాహనదారులు ఆందోళన : కాజ్‌వే పైనే భారీ వాహనాలు సైతం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ వాహనం ఇక్కడ దిగబడిపోతోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వంతెనల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తే వాహనదారులకు ఉపశమనంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. అదేవిధంగా ఏజెన్సీ వైపు వెళ్లే పర్యాటకులకు ఊరటగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Bridge Collapse: నిర్వహణ లోపం.. కుప్పకూలే దుస్థితికి చేరుకున్న పురాతన వంతెనలు..

People Demand for Buggavanka Bridge రక్షణ గోడ కట్టారు.. ప్రయాణించే వంతెన నిర్మించడం మరిచారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.