ETV Bharat / state

ఆ రోడ్డుపై ప్రయాణం - వారంలో రెండుసార్లు షెడ్​కు వాహనాలు - గుంతల రోడ్ల సమస్యలు

People Facing Problems with Damaged Roads in NTR District : గ్రామీణ రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. గత కొన్నేళ్లుగా రహదారి బాగోగులు చూసే నాథుడే లేకపోవడంతో రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. అడుగుకో గుంతతో అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు క్రాస్ రోడ్డు- విస్సన్నపేట మార్గంలోని రేపూడితండా వరకు రహదారే ఇందుకు ఉదాహరణ. ఈ రహదారిని బాగు చేయాలని స్థానికులు కొన్నేళ్లుగా నెత్తీనోరు మొత్తుకుంటున్నా పట్టించుకునే పాలకులు కన్పించడం లేదు.

people_facing_problems_with_damaged_roads_in_ntr_district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 9:10 PM IST

ఆ రోడ్డుపై ప్రయాణం - వారంలో రెండుసార్లు షెడ్​కు వాహనాలు

People Facing Problems with Damaged Roads in NTR District : రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామంటూ నిత్యం డప్పు కొట్టుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలకు అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం అంటే ఏంటో తెలుసా? మాట్లాడితే చాలు ప్రజల ఖాతాల్లో నేరుగా వేల కోట్ల రూపాయలు వేశామంటున్న జగన్‌ రహదారులను బాగు చేసే బటన్ ఎందుకు నొక్కట్లేదు? గ్రామ స్వరాజ్యం అంటూ ప్రజలను మభ్యపెడుతున్న పాలకులు కనీసం రోడ్లపై గుంతల్లో తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ జిల్లా (​NTR District) ఎ.కొండూరు - విస్సన్నపేట రహదారే ఇందుకు నిదర్శనం. ఐదేళ్లుగా ఛిద్రమైన రోడ్డును బాగుచేయకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.

Road Problems To Andhra Pradesh people : ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు క్రాస్ రోడ్డు - విస్సన్నపేట రహదారి (Road) చూస్తే అడుగడుగునా గుంతలతో కంకర తేలి దుమ్ము ధూళి ఎగిసిపడుతూ కళ్లు బైర్లు కమ్ముతాయి. ముందొచ్చే వాహనం ఏదో కనిపించదు. దాదాపు 6 కిలోమీటర్లు రేపూరి తండా వరకు రహదారి భయానకంగా మారింది. ఈ మార్గంలో రావాలంటేనే జనం హడలిపోతున్నారు. రహదారి రెండు వైపులా కోతకు గురైంది. రోడ్డు దారుణంగా మారడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇంత జరుగుతున్నా రోడ్డును బాగు చేసేందుకు పాలకులకు చేతులు రావడం లేదని స్థానిక ప్రజలు (People) వాపోతున్నారు.

అధ్వానంగా తయారైన రహదారి - సొంత నిధులతో మరమ్మతులు చేపట్టిన సర్పంచ్

Road Problems in Vijayawada Rural area : రోడ్డే అధ్వానంగా మారిందంటే దానికంటే దారుణం కుమ్మరికుంట వంతెన. వారధి శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. తప్పని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ జనం రాకపోకలు సాగిస్తున్నారు. వీటిని బాగు చేయాలని స్థానికులు చేసిన విన్నపాలు బుట్ట దాఖలు అవుతున్నాయి. కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం ఎందుకని ప్రయాణికులు (Passengers) నిలదీస్తున్నారు.

'ఈ రోడ్డులో తిరిగితే ప్రయాణికులే కాదు వాహనాలూ గుల్ల అవ్వాల్సిందే. కుదుపులకు ఆటోలు, బైక్‌లు వారంలో రెండుసార్లు షెడ్‌కు వెళ్లాల్సివస్తోంది. వచ్చిన ఆదాయం కంటే మరమ్మతులకే ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా మా సమస్యలు అధికారులకు కనిపించడం లేదు.' -శోభనాద్రి,కిశోర్ ఆటో డ్రైవర్లు

రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక

ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలకు రోడ్డు సదుపాయాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం (Govt) పట్టించుకోకపోతే ఇక ఏం చెయ్యాలో తమకు తెలుసని హెచ్చరిస్తున్నారు.

అన్నీ గుంతలే! రోడ్డు ఏది జగనన్నా? - వాహనచోదకులకు ప్రాణసంకటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.