ETV Bharat / state

మీరు కారుని అద్దెకిస్తున్నారా? అయితే జాగ్రత్త - మీకు తెలియకుండానే! - Car Rent Fraud In Kadapa

People Committing Frauds by Pawning Cars in Kadapa: కడపలో కొత్త తరహా మోసం కేసు వెలుగులోకి వచ్చింది. కార్లను అద్దెకు తీసుకుని కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కోట్ల విలువ చేసే 26 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్ల కుంభకోణం కడపలో చర్చనీయాంశంగా మారింది.

People Committing Frauds by Pawning Cars in Kadapa
People Committing Frauds by Pawning Cars in Kadapa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 2:58 PM IST

Updated : Sep 28, 2024, 3:44 PM IST

People Committing Frauds by Pawning Cars in Kadapa : సులువైన మార్గంలో డబ్బులు సంపాదించడంపై కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. కొత్త పంథాలు వెతుకుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. చివరకు అడ్డంగా దొరికి జైళ్లో ఊచలు లెక్కపెడుతున్నారు. తాజాగా కడపలో కార్లను కుదవ పెట్టి చీటింగ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కార్లను కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు దాదాపు 2 కోట్ల రూపాయలు విలువచేసే 26 వాహనాలను పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే కడప నబికోట చెందిన శశిధర్​రెడ్డి, జిలాని భాష అనే ఇద్దరు కార్ల యజమానుల వద్దకు వెళ్లి కార్లను నెలరోజుల పాటు అద్దెకి ఇవ్వాలని అడుగుతారు. నెలకు 30,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెబుతారు. యజమానులు నమ్మకంతో కార్లను అద్దెకిస్తారు. 2 లేదా 3 నెలల పాటు క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తారు. ఇక నాలుగో నెల వచ్చేసరికి అద్దె చెల్లించరు. దీంతో కార్ల యజమాని వచ్చి అద్దె ఇవ్వలేదు, కార్లు వెనక్కి ఇవ్వాలంటూ అడుగుతారు. కార్లు లేవు కుదవపెట్టామని చెప్పేస్తారు.

ఆ 1500 మందికి ATMలా బల్దియా - పని చేయకుండానే నెలనెలా జీతాలు - No Work But Taking Salary in GHMC

ఇలా దాదాపు 10 నుంచి 15 మంది వ్యక్తులకు సంబంధించిన 36 కార్లను అద్దెకు తీసుకొని వీరిద్దరూ కుదవ పెట్టారు. వాటిలో ఇప్పటివరకు పోలీసులు 26 కార్లను స్వాధీనపరుచుకున్నారు. మరికొన్ని కార్లను స్వాధీన పరుచుకోవాల్సి ఉంది. ఈ ఘటన ఇటీవల వెలుగులోకి రావడంతో బాధితులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. నిందితులు ఇలా చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిపై ఇలాంటి చీటింగ్ కేసులు గతంలో ఏమైనా నమోదయ్యాయా అని కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది వరకే జిలాని, శశిధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కార్లను కోర్టులో ప్రవేశపెట్టి బాధితులకు అప్పగించాల్సి ఉంది. మొత్తం మీద ఈ కార్ల కుంభకోణం కడపలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో బాధితులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి తలనొప్పులు ఉండవని పోలీసులు సూచిస్తున్నారు.

మీ అకౌంట్​లో డబ్బు జమ అయినట్లు మెసెజ్​ వచ్చిందా? - అది డమ్మీ కావొచ్చు, బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి - Dummy Messages Cyber Crime in hyd

డేటింగ్ పేరుతో చీటింగ్- అందమైన యువతుల ఫొటోలతో అమెరికన్‌ యువకులకు ఎర - HYD Police Arrest Online Fraudster

Last Updated : Sep 28, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.